కల్కి 2898.. ఇసుకను చూసి కాపీ అంటే ఎలా?

ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా రాబోతున్న చిత్రం కల్కి 2898ఏడీ

Update: 2024-04-30 05:39 GMT

ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా రాబోతున్న చిత్రం కల్కి 2898ఏడీ. ఇది ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ మూవీ కావడం విశేషం. నాగ్ అశ్విన్ విజన్ నుంచి ఈ మూవీ దృశ్యరూపంగా మారబోతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు కల్కి 2898ఏడీ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశం అయిన భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉండే సబ్జెక్టు కావడంతో సినీ ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు హాలీవుడ్ రేంజ్ లో ఉందనే టాక్ వచ్చింది. విజువలైజేషన్ అద్భుతంగా ఉండబోతోందని అందరూ నమ్మారు. అయితే కొందరు పనిగట్టుకొని ఈ సినిమాని హాలీవుడ్ మూవీ డ్యూన్ తో పోల్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 2021లో హాలీవుడ్ లో రిలీజ్ అయినా డ్యూన్ మూవీ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది. దానికి సీక్వెల్ ఈ ఏడాది విడుదలైంది.

అయితే ఈ సినిమా 20 వేల సంవత్సరాల తర్వాత భూమిపై సజీవంగా ఉన్న కొంతమంది వారి ఉనికిని కాపాడుకోవడం ఎలాంటి పోరాటం చేసారు అనేది చూపించారు. ఆ సినిమా కోసం కొత్త వాతావరణం సృష్టించారు. కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ కొత్త వాతావరణం సృష్టించాడు. ఈ మూవీ 800 ఏళ్ళ తర్వాత జరిగే కథగా చూపించబోతున్నారు. రెండింటి మధ్య విజువల్ పరంగా కొన్ని సిమిలారిటీస్ ఉండేసరికి డ్యూన్ మూవీతో కంపారిజన్ చేయడం మొదలు పెట్టారు.

Read more!

అయితే ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా కాస్త ఇసుకను చూసి అలా భావించి ఉండవచ్చు. అలాగే ఈ తరహాలో పోల్చడం కొత్తేమి కాదు.. గతంలో కూడా చాలాసార్లు ఇతర సినిమాలతో పోల్చారు అని నాగ్ అశ్విన్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కల్కిగా ప్రభాస్, అశ్వద్ధామగా అమితాబచ్చన్, దీపికా పదుకునే పాత్రలని హైలైట్ చేశారు. ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్ అంతా కూడా మైథాలజీకి కనెక్ట్ అయ్యే సింబల్ ని రిప్రజెంట్ చేశారు. అయితే ఈ పోస్టర్ ని డ్యూన్ పోస్టర్ తో పోల్చి సోషల్ మీడియాలో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

అలాగే రెండు సినిమాల టైమ్ లైన్, అలాగే రెండు సినిమాల కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్ అనే విషయం తెలుసుకోవాలని మరికొందరు సినీ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఇండియన్ మైథాలజీలో ఉండే అద్భుతమైన కథని నాగ్ అశ్విన్ అంతే అద్భుతంగా ప్రాణం పోసి కల్కి2898ఏడీలా తీసుకొస్తున్నాడని చెబుతున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ కామెంట్స్ చేసే వారికి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News