కార్తి ఖైదీ 2 లో తెలుగు స్టార్..?
కోలీవుడ్ స్టార్ కార్తి సర్దార్ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఖైదీ 2 ని లైన్ లో పెట్టాడు.;
కోలీవుడ్ స్టార్ కార్తి సర్దార్ 2 సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఖైదీ 2 ని లైన్ లో పెట్టాడు. అటు లోకేష్ కూడా రజినీకాంత్ కూలీ పూర్తి చేసి కార్తి సినిమాను మొదలు పెట్టే ప్లానింగ్ లో ఉన్నాడు. ఐతే లోకేష్ కార్తి తో చేసే ఖైదీ 2 సినిమాలో తెలుగు స్టార్ హీరోని కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు కోలీవుడ్ టాక్. ఇప్పటికే రజినీకాంత్ కూలీ సినిమాలో లోకేష్ మన కింగ్ నాగార్జునని తీసుకున్నారు. అంతేకాదు కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పుడు ఖైదీ 2 సినిమాలో కూడా లోకేష్ టాలీవుడ్ స్టార్ ని భాగం చేస్తున్నారట. ఐతే ఆ స్టార్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. లోకేష్ కనకరాజ్ సినిమాల్లో మిగతా హీరోల క్యామియో స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తాయి. కమల్ తో చేసిన విక్రం సినిమాలో చివర్లో సూర్య రోలెక్స్ పాత్రలో అదరగొట్టాడు. సినిమాకు అది ఒక హై ఇచ్చింది. సూర్య రోలేక్స్ రోల్ తో ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరే రేంజ్ లో అది క్లిక్ అయ్యింది.
ఖైదీ సినిమాలో ఢిల్లీ పాత్రలో కార్తి ఏ రేంజ్ లో అదరగొట్టాడో తెలిసిందే. ఇప్పుడు ఖైదీ 2 లో కూడా మరోసారి రచ్చ చేయాలని చూస్తున్నాడు. ఐతే ఖైదీ 2 లో నటించే తెలుగు స్టార్ ఎవరన్నది తెలుసుకోవాలని చూస్తున్నారు. కార్తి రీసెంట్ గా నాని హిట్ 3 చివర్లో సర్ ప్రైజ్ చేశాడు. హిట్ 4 లో కార్తి చేస్తాడని హింట్ ఇస్తూ శైలేష్ కొలను చేసిన ప్రయత్నం అదిరిపోయింది.
ఇప్పుడు ఖైదీ 2 కోసం కార్తి కోసం మరో తెలుగు హీరో చేయడానికి రెడీ అయ్యాడు. కార్తి సినిమా అంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి బజ్ ఉంటుంది. సూర్య కన్నా తర్వాత వచ్చినా కూడా కార్తి కి తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కార్తి తెలుగు కూడా బాగా మాట్లాడుతాడు కాబట్టి ఇక్కడ కూడా అతనికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక రాబోతున్న సర్ధార్ 2, ఖైదీ 2 ఇలా అన్ని సినిమాలకు మన దగ్గర కూడా మంచి మార్కెట్ జరిగే ఛాన్స్ ఉంటుంది.