వీరమల్లు డైరెక్టర్ మరో క్లాసిక్ లవ్ స్టోరీ!
అయితే ఈ సినిమా తర్వాత జ్యోతికృష్ణ ఓ క్లాసిక్ లవ్ స్టోరీ తెరకెక్కించాలని చూస్తున్నాడుట. ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ సిద్దం చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది.;
'హరిహర వీరమల్లు' సినిమాతో జ్యోతికృష్ణ పేరు మళ్లీ ఇండస్ట్రీలో మారుమ్రోగుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లోకి అనుకోకుండా క్రిష్ తప్పుకోవడం జ్యోతికృష్ణ ఎంటర్ అవ్వడం అప్పటి కప్పుడలా జరిగిపోయింది. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమా నులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా లేదన్నా? అన్ని పనులు పూర్తి చేసి ఈ ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈ సినిమా హిట్ అయితే జ్యోతికృష్ణ దర్శకుడి ఇమేజ్ కూడా మారుతుంది. పీరియాడిక్ స్టోరీ కావడంతో? కొత్త ఇమేజ్ ఏర్పడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత జ్యోతికృష్ణ ఓ క్లాసిక్ లవ్ స్టోరీ తెరకెక్కించాలని చూస్తున్నాడుట. ఓ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ సిద్దం చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకైంది. జ్యోతికృష్ణ ఇప్పటి వరకూ డైరెక్టర్ గా ఐదు సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
తొలి సినిమా' నీమనసు నాకు తెలుసు' అంటూ ఓ క్లాసిక్ లవ్ స్టోరీ చేసాడు. తరుణ్, త్రిష జంటగా రెహమాన్ సంగీతం అందించిన చిత్రమిది. ఈ సినిమా కమర్శియల్ గా సక్సెస్ కాలేదు గానీ ప్రేమికులకు అప్పట్లో బాగా కనెక్ట్ అయింది. అప్పట్లోనే ఇది అడ్వాన్స్ లవ్ స్టోరీ కావడంతో చాలా మందికి కనెక్ట్ అవ్వలేదు. కానీ జ్యోతికృష్ణ లో సెన్సిబిలిటీని హైలైట్ చేసిన చిత్రమిది. ఆ తర్వాత 'కేడీ', 'ఊ లాలాలా' , 'ఆక్సిజన్' చిత్రాలు తెరకెక్కించాడు.
కానీ ఇవేవి పెద్దగా ఆడలేదు. అయితే ఈ చిత్రాలన్నీ చాలా గ్యాప్ తీసుకుని చేసినవే. ఆక్సిజన్ తర్వాత ఆరళ్ల గ్యాప్ అనంతరం 'రూల్స్ రంజన్' తెరకెక్కించాడు. ఇది సరైన ఫలితాలు సాధించలేదు. దీంతో సొంత బ్యానర్లోనే 'హరిహర వీరమల్లు' ను ఏ.ఏమ్ రత్నం మొదలు పెట్టడం క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలు రత్నం కుమారుడైన జ్యోతికృష్ణ తీసుకున్నాడు.