అల్లు అర్జున్ కు ఆర్య.. కిరిటీకి జూనియర్
ఇందులో రెండో కోవకు చెందిన ఓ హీరోనే కిరీటి. ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకే కిరిటీ. అతను హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా జూనియర్.;
ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. అయితే అందులో కొందరు తమ లుక్స్, బాడీ లాంగ్వేజ్ తోనే అందరినీ ఆకట్టుకుంటే మరికొందరు మాత్రం తమ టాలెంట్, కాన్ఫిడెన్స్‌తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తారు. ఇందులో రెండో కోవకు చెందిన ఓ హీరోనే కిరీటి. ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి కొడుకే కిరిటీ. అతను హీరోగా అరంగేట్రం చేస్తున్న సినిమా జూనియర్. వారాహీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. జులై 18న జూనియర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.
మొదట్లో నిర్మాత సాయి గారు ఈ సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా అనుకున్నానని, కానీ ఆ తర్వాత శ్రీలీల, జెనీలియా, దేవీ శ్రీ ప్రసాద్, సెంథిల్, రవిచంద్రన్, పీటర్ ఇలా యాడ్ అవడం చూసి చాలా పెద్ద సినిమా అని తెలుసుకున్నానని, జెనీలియా అప్పుడెలా ఉందో ఇప్పుడూ అంతే ఉందని, దేవీ శ్రీ ఎప్పుడూ తన మ్యూజిక్ తో సినిమాను ఎలివేట్ చేస్తాడని, వైరల్ వయ్యారి ఎంత వైరలైందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదని, జూనియర్ ను ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని ఆ పాట కలిగించిందని, ససెంథిల్ గురించి చెప్పాలంటే సొంతింట్లోని మనిషి గురించి చెప్పినట్టే అవుతుందని, ఎక్కడా కాంప్రమైజ్ అవడని, డైరెక్టర్ ని కూడా కాంప్రమైజ్ అవనీయడని, పీటర్ ప్రతీదీ చాలా బెటర్ గా చేయాలని చూస్తుంటారని, పీటర్, సెంథిల్ ఇద్దరూ ఓ అబ్బాయి బాగా చేస్తున్నాడని చెప్తున్నారంటే కిరీటీకి అంతకంటే పెద్ద సర్టిఫికెట్ ఇండస్ట్రీలో ఎక్కడా ఉండదని, కిరీటీని ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తుందని, శ్రీలీల మంచి డ్యాన్సర్ అని, డైరెక్టర్ రాధాకృష్ణ మూడేళ్ల నుంచి ఇదే ప్రాజెక్టుపై వర్క్ చేశారని, తప్పకుండా జూనియర్ తనకు మంచి పేరుని తీసుకొస్తుందని దర్శకధీరుడు రాజమౌళి చెప్పారు.
నిర్మాత తననెంతో నమ్మి ఈ సినిమా చేసినందుకు ఆయనకు లైఫ్ లాంగ్ కృతజ్ఞతతో ఉంటానన్న కిరిటీ జూనియర్ సినిమా తన కోసం1% సాయి గారి కోసం 99% హిట్ అవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పైకొస్తే ఇండస్ట్రీకి చాలా మంచిదని, ఈ సినిమాతో రాధాకృష్ణ చాలా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నానని అన్నారు. జెనీలియా గారు చాలా బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అని, 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సినిమాలో ఆమె పాత్ర రెగ్యులర్ గా ఉండదని, తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన సెంథిల్ కు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. సినిమాకు దేవీ శ్రీ మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ అని, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, ఈ సినిమా కోసం మూడేళ్ల పాటూ కష్టపడ్డామని హీరో కిరిటీ చెప్పారు.
జూనియర్ సినిమాతో మళ్లీ అందరినీ కలుససుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పిన జెనీలియా, తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జులై 18 కిరీటికి చాలా బిగ్ డే అని, తామంతా అతన్ని సపోర్ట్ చేస్తామని, తన సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటామని అన్నారు.
నిర్మాత సాయి గారు తనకు అమ్మవారి విగ్రహాన్ని ఇచ్చారని, వాళ్ల ఇంటికి లక్ష్మీ దేవి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు హీరోయిన్ శ్రీలీల. డైరెక్టర్ రాధాకృష్ణ జూనియర్ కోసం మూడేళ్ల పాటూ కష్టపడ్డారని, దేవీ శ్రీ ప్రసాద్ వల్లే తనకు వైరల్ వయ్యారి ట్యాగ్ వచ్చిందని, జెనీలియా తెలుగు సినిమాల్లో ఓ బ్రాండ్ క్రియేట్ చేశారని, హీరో కిరీటికి సినిమా తప్ప మరో ధ్యాసే ఉండదని, జూనియర్ కోసం ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారని తెలిపారు.
జూనియర్ సినిమాకు చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశానన్నారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. డైరెక్టర్ రాధాకృష్ణ మూడేళ్ల పాటూ ఈ సినిమా కోసం వర్క్ చేశారని, సెంథిల్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు ఎంత ప్యాషన్ గా వర్క్ చేశారో జూనియర్ సినిమాక్కూడా అంతే ప్యాషన్ గా వర్క్ చేశారని, పీటర్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తగా ఉన్నాయని అన్నారు. జెనీలియాను మళ్లీ ఇక్కడ చూడటం ఆనందంగా ఉందని చెప్పిన దేవీ, శ్రీలీల గొప్ప డ్యాన్సర్ అన్నారు. కిరిటీ చాలా పెద్ద స్టార్ అవుతాడని, సినిమాలో తన యాక్షన్, కామెడీ, డ్యాన్సులు చూసి ఇది నిజంగా అతని మొదటి సినిమానేనా అనిపిస్తుందని, అల్లు అర్జున్ కు ఆర్య ఎలాంటి సక్సెస్ ను ఇచ్చిందో కిరిటీకి జూనియర్ అలాంటి హిట్ ను ఇస్తుందని అన్నారు.
రాజమౌళి గారు ఈ ఈవెంట్ కు రావడం ఎంతో ఆనందంగా ఉందని, జూనియర్ మూవీ చేయడానికి కారణం నిర్మాత సాయి గారేనని చెప్పారు డీఓపీ సెంథిల్ కుమార్. డైరెక్టర్ కథ చెప్పగానే నచ్చిందని, కిరిటీ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని అన్నారు. కిరిటీ లాంటి డెడికేషన్ ఉన్న యాక్టర్ ను కెరీర్ లో చూడలేదని, కాళ్ల నుంచి రక్తం వస్తున్నా పర్ఫెక్షన్ కోసం 200 టేకులు చేశాడని, ఫ్యూచర్ లో తప్పకుండా పెద్ద స్టార్ అవుతాడని సెంథిల్ చెప్పారు.