తారక్@2025.. ఈ బర్త్ డే ఎందుకంత స్పెషల్?
జూనియర్ ఎన్టీఆర్.. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అంచలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన విషయం తెలిసిందే.;
జూనియర్ ఎన్టీఆర్.. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అంచలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన విషయం తెలిసిందే. తాత స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ కు తగ్గ మనవడిగా ప్రూవ్ చేసుకున్నారు. భారీ డైలాగ్స్, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీన్స్.. ఎందులో అయినా తోప్ అని నిరూపించుకున్నారు.
క్లాస్ మాస్ అంటూ తేడా లేకుండా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు సినీ ప్రియులు, సెలబ్రిటీల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే ఈ బర్త్ డే ఆయనకు చాలా స్పెషల్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
ఎందుకంటే 2025లో ఆయన సినీ కెరీర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లు పూర్తి కానుంది. అంటే సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన యాక్ట్ చేస్తున్న వార్-2 మూవీ.. ఆగస్టు 14వ తేదీన హిందీ, తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ లో పవర్ ఫుల్ గా కనిపించారు.
అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో తారక్.. బాలీవుడ్ లో సందడి చేశారు. కానీ స్ట్రయిట్ హిందీ మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు వార్ 2తో అది నెరవేరనుంది. ఆ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే పలువురు తెలుగు స్టార్ హీరోలు.. బాలీవుడ్ డెబ్యూ సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. కానీ ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న వార్-2.. క్రేజీ కంటెంట్, స్టైలిష్ యాక్షన్, భారీ బడ్జెట్ తో స్పై థ్రిల్లర్ గా సందడి చేయనుంది. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.
కాబట్టి వార్-2 హిట్ అయితే నార్త్ లో తారక్ కు ఉన్న క్రేజ్ పీక్స్ కు చేరుతుంది. అదే సమయంలో అందరిలానే తన కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన.. ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు అందుకున్నారు. కానీ టెంపర్ తో హిట్ ట్రాక్ ఎక్కి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు వార్-2తో తన హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తే వేరే లెవెల్. మరి ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.