ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త్రివిక్ర‌మ్ దూర‌మౌతున్నారా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం ఉన్న విష‌యం తెలిసిందే. `జ‌ల్సా` నుంచి మొద‌లైన వీరి స్నేహం ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతూ వ‌స్తోంది.;

Update: 2026-03-16 07:36 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య మంచి అనుబంధం ఉన్న విష‌యం తెలిసిందే. `జ‌ల్సా` నుంచి మొద‌లైన వీరి స్నేహం ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగుతూ వ‌స్తోంది. ఓ ద‌శ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన సినిమాల‌కు త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్‌, ప్రాజెక్ట్ ప‌ర్య‌వేక్ష‌ణ వంటి వ్య‌వ‌హ‌రాలు చూసుకున్నారు. `భీమ్లానాయ‌క్‌` మూవీకి ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర అయినా మొత్తం వెన‌కుండి న‌డిపించింది మాత్రం త్రివిక్ర‌మే అన్న‌ది అంద‌రికి తెలిసిందే. ప‌వ‌న్‌కు సంబంధించిన ప్ర‌తి సినిమా విష‌యంలోనూ త్రివిక్ర‌మ్ ఇన్‌వాల్వ్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి అన్న‌ట్టుగా మారింది.

ఇది ఎక్క‌డా వ‌ర‌కు వెళ్లిందంటే ప‌వ‌న్ రాజ‌కీయ వేదిక‌ల‌పై చేసే ప్ర‌సంగాల వ‌ర‌కు వెళ్లింది. ప‌వ‌న్ చేసే పొలిటిక‌ల్ స్పీచ్‌లు త్రివిక్ర‌మ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాడ‌ని, వాటినే వేదిక‌ల‌పై ప‌వ‌న్ చ‌దువుతున్నాడ‌ని అప్ప‌ట్లో ఓ పార్టీ వారు డైరెక్ట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉంటే `బ్రో` మూవీ వ‌ర‌కు ప‌వ‌న్ సినిమాల‌కు త‌న కంట్రీబ్యూష‌న్ అందించిన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన సినిమాల‌కు స్టోరీ మార్పుల్లోనూ, డైలాగ్స్ ప‌రంగానూ, స్క్రీన్ ప్లే పరంగానూ స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు.

అయితే గ‌త కొన్ని సినిమాల నుంచి ప‌వ‌న్ సినిమాలో త్రివిక్ర‌మ్ జోక్యం చేసుకోవ‌డం లేదు. త‌న ఇన్‌వాల్వ్ మెంట్ ఉండ‌టం లేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త్రివిక్రమ్ వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌ని త‌న‌ని క‌లిసిన ప్రొడ్యూస‌ర్‌ని త్రివిక్ర‌మ్ సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. ప్ర‌స్తుతం త‌న దృష్టి మొత్తం వెంక‌టేష్‌తో రూపొందిస్తున్న `ఆదిర్శ‌కుటుంబం హౌస్ నెం. 47`పైనే ఉంద‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. ఈ మూవీతో పాటు త్రివిక్ర‌మ్ త్వ‌ర‌లో తెర‌పైకి రానున్న భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే.

`హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` నుంచి ప‌వ‌న్ సినిమాల‌కు త్రివిక్ర‌మ్ దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈ మూవీ విష‌యంలో ఎలాంటి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌ని త్రివిక్ర‌మ్ `ఓజీ`, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` సినిమాల‌కు కూడా ఇదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించారు. అంతే కాకుండా సినిమాల ఫంక్ష‌న్‌ల‌కు కూడా దూరంగా ఉంటూ వ‌స్తుండ‌టంతో ప‌వ‌న్‌కు త్రివిక్ర‌మ్ దూరంగా ఉంటున్నార‌ని, ఆయ‌న దృష్టి మొత్తం త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల‌పైనే ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్స‌టికే విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తున్నాయి. దీని త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రొడ్యూస‌ర్ రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ సినిమాకు రెడీ అవుతున్నారు. దీనితో పాటు మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో కూడా ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీకి శ్రీ‌కారం చుట్టాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా మ‌రో ప్రాజెక్ట్ కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News