పవన్ 'OG'.. ఇప్పటికీ టీవీలో ఎందుకు రాలేదు?

థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఓజీ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. అక్కడ కూడా మంచి వ్యూస్ అందుకుంది.;

Update: 2026-03-16 07:25 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అందుకు గాను మేకర్స్ ఓవైపు ఏర్పాట్లు చేస్తూ.. మరోవైపు ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే అటు థియేటర్స్ లో ఉస్తాద్ మూవీ వచ్చేందుకు సిద్ధమవుతుండగా.. ఇటు సోషల్ మీడియాలో పవన్ గత మూవీ ఓజీ కోసం జోరుగా చర్చ సాగుతోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఆ గ్యాంగ్ స్టర్ డ్రామా.. గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్స్ లో రిలీజవ్వగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అభిమానులకు ఓ రేంజ్ లో సినిమా నచ్చేసింది. కొంతకాలం పాటు ఓజీ ఫీవర్ నడిచింది.

థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ గా ఓజీ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. అక్కడ కూడా మంచి వ్యూస్ అందుకుంది. కానీ ఇప్పటి వరకు ఓజీ మూవీ.. టీవీలో రాలేదు. అంటే టెలివిజన్ ప్రీమియర్‌ జరగలేదు.. అది కూడా తెలుగు వెర్షన్ కు మాత్రమే.. ఓజీ సినిమా హిందీ వెర్షన్.. జనవరి 10వ తేదీన టీవీలో స్టార్ గోల్డ్ ఛానల్ లో ప్రసారమైంది.

కానీ తెలుగు వెర్షన్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. నిజానికి.. ఓజీ తెలుగు శాటిలైట్ హక్కులు ప్రముఖ ఛానల్ స్టార్ మా దక్కించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో రిలీజ్ కు ముందే శాటిలైట్ డీల్ జరిగిందని అంతా అనుకున్నారు. థియేటర్స్ లో సినిమా వచ్చినా ఐదు- ఆరు నెలల తర్వాత టీవీలో మూవీ ప్రసారం అవుతుందని ఫిక్స్ కూడా అయిపోయారు.

అయితే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఐదు నెలలు దాటిపోయింది. కానీ ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు. కనీసం స్టార్ మా దక్కించుకుందో కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన డీల్ ఏకంగా ఖరారు అవ్వలేదని వార్తలు వస్తుండడం గమనార్హం. డీల్ అమౌంట్ విషయంలో అభిప్రాయం కుదరకపోవడంతో ఓజీ హక్కులు ఎవరూ సొంతం చేసుకోలేదని రూమర్లు వినిపిస్తున్నాయి.

అందులో నిజమెంతో తెలియకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న చిత్రానికి శాటిలైట్ డీల్ ఖరారు అవ్వకపోవడమేంటని అనేక మంది నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. మరి ఓజీ మూవీ తెలుగు వెర్షన్ శాటిలైట్ డీల్ విషయంలో అసలు నిజమేంటో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News