త్రిష - విజయ్.. వ్వాటే టైమింగ్!
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని తేదీలు కూడా అచ్చం అలాంటి చర్చకే దారి తీస్తున్నాయి.;
కొన్ని సందర్భాల్లో ఏవైనా హఠాత్తుగా జరిగితే అవి యాదృచ్ఛికంగా జరిగినవా? లేక ఎవరైనా ప్లాన్ చేసినట్లా? అనే డౌట్ కలుగుతుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని తేదీలు కూడా అచ్చం అలాంటి చర్చకే దారి తీస్తున్నాయి. విడాకుల కేసు విచారణ తేదీ, తమిళనాడు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు రోజు, నటి త్రిష పుట్టినరోజు.. ఇలా కీలకమైన తేదీలు దగ్గరగా రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల కేసు విచారణ ఏప్రిల్ 20న జరగనుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అదే సమయంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి.
ఇప్పటికే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి విజయ్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగుతున్నట్లు కనిపిస్తున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికలు.. ఆయనకు కీలకంగా మారాయి. అదే సమయంలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తో విజయ్ డేటింగ్ లో ఉన్నారని కొంతకాలంగా ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గతంలో అనేక సినిమాల్లో కలిసి నటించారు.
ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని సినీ వర్గాల్లో చెప్పుకుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, ఫోటోలు ఆ ప్రచారాలకు మరింత బలం చేకూర్చాయి. కొన్ని సందర్భాల్లో విజయ్, త్రిష కలిసి కనిపించిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. దీంతో వీరిద్దరి మధ్య సంబంధం ఉందనే ప్రచారం మరింత పెరిగింది.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. అదే రోజు త్రిష కృష్ణన్ పుట్టినరోజు కూడా కావడం సోషల్ మీడియాలో మరోసారి చర్చకు కారణమైంది. ఈ తేదీలన్నింటినీ చూసి కొందరు నెటిజన్లు ఇది కేవలం యాదృచ్ఛికమా? అని ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం డేట్స్ టైమింగ్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఈ వార్తలపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. విడాకుల కేసు, డేటింగ్ ప్రచారాలు, వైరల్ వీడియోలపై కూడా స్పష్టత రాలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయాలు ఎక్కువగా ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మొత్తానికి చూస్తే విజయ్ వ్యక్తిగత జీవితం, తమిళనాడు రాజకీయ పరిణామాలు, త్రిష కృష్ణన్ తో డేటింగ్ రూమర్లు.. ఈ మూడు అంశాలు ఒకేసారి చర్చలోకి రావడం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.