'కుబేర' నటుడి వయసు 12 ఏళ్లు పెంచారు..!
బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు జిమ్ సర్భ్. సినిమాల్లోనే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతున్న పలు వెబ్ సిరీస్‌ల్లోనూ ఇతడు నటించాడు.;
బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు జిమ్ సర్భ్. సినిమాల్లోనే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై స్ట్రీమింగ్ అవుతున్న పలు వెబ్ సిరీస్‌ల్లోనూ ఇతడు నటించాడు. ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్‌ను సొంతం చేసుకోవడం ద్వారా అరుదైన గౌరవం దక్కించుకోవడంతో పాటు, ఎమ్మీ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకోవడం ద్వారా నటుడిగా చిన్న వయసులోనే అరుదైన గౌరవంను సొంతం చేసుకున్నాడు. పీరియాడికల్ డ్రామా పద్మావత్‌తో పాటు సంజు సినిమాల్లో జిమ్ సర్భ్ పోషించిన పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. అతడి నటన గురించి అప్పటి నుంచే మాట్లాడుకోవడం మొదలైంది. వయసుతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలను, విభిన్నమైన ఏజ్ గ్రూప్ పాత్రలను చేయడం ద్వారా జిమ్ తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేశాడు.
కుబేర సినిమాలో విలన్‌గా జిమ్ సర్భ్
ఇటీవల ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమాలో విలన్ పాత్రను పోషించాడు. అత్యంత క్రూరమైన పాత్రలో జిమ్ చక్కని నటన కనబర్చారు. అంతే కాకుండా పాత్రకు తగ్గట్లుగా మంచి ఫిజిక్‌ను, స్టైల్ లుక్‌ను సైతం జిమ్ కనబర్చాడు. అందుకే కుబేర సినిమా తర్వాత సౌత్‌లో ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో ఇతడికి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఒక జాతీయ మీడియా సంస్థ ఒకటి బాలీవుడ్‌కి చెందిన నటుల్లో 50 ఏళ్ల వయసులో హాట్‌గా ఉండి ఆకట్టుకునే నటుల జాబితాను తయారు చేసింది. అందులో బాలీవుడ్ స్టార్స్ చాలా మంది పేర్లు ఉన్నాయి. అయితే అందులో జిమ్ సర్భ్ పేరు ఉండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దానిపై జిమ్ చాలా సరదాగా స్పందించాడు.
సోషల్ మీడియాలో విమర్శలు
ఆ జాబితా 50 ఏళ్ల వయసులో చాలా హాట్‌గా కనిపిస్తున్న వారిది. కానీ అందులో 38 ఏళ్ల జిమ్ సర్భ్ ను చేర్చడం విడ్డూరంగా అనిపించింది. అంటే సదరు మీడియా సంస్థ తన కథనంలో జిమ్ యొక్క వయసును ఏకంగా 12 సంవత్సరాలకు పెంచిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జిమ్ సర్భ్ సైతం ఎక్స్ ద్వారా ఆ మీడియా సంస్థ కథనంపై స్పందించాడు. నాకు 38 ఏళ్లు అయినా కూడా 50 సంవత్సరాల వయసులో ఫిట్ గా ఉన్నట్లుగా ఉన్నాను అన్నట్లుగా స్మైల్ ఈమోజీని షేర్ చేశాడు. అతడు పెద్దగా సీరియస్ కాకుండా చాలా సింపుల్‌గా సదరు కథనంకు కౌంటర్ ఇచ్చాడు. అంత గుడ్డిగా ఎలా జిమ్ వయసు 50 ఏళ్లు అంటూ వేశారు అని చాలా మంది ఎక్స్ ద్వారా సదరు కథనంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్‌లో..
జిమ్ సర్భ్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఇతడు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సిరీస్‌లు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. నటుడిగా మంచి మార్కులు దక్కించుకోవడం మాత్రమే కాకుండా సినిమా విజయంలో తనదైన పాత్ర పోషిస్తూ, అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఉన్నాడు. అందువల్ల ఇంకాస్త ఎక్కువ ఆఫర్లు ఇతడి ఖాతాలో పడుతున్నాయి. రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్‌లో డాక్టర్ హోమి భాభా పాత్రను పోషించడం ద్వారా వార్తల్లో నిలిచిన జిమ్ సర్భ్ ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌ల్లో ఆఫర్లు దక్కించుకున్నాడు. ముందు ముందు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ బిజీ స్టార్‌గా, స్టార్ విలన్‌గా వెలుగు వెలగడం ఖాయం. అయిదు పదుల వయసుకు వచ్చేప్పటికీ ఇతడు ఇదే స్థాయిలో మరింత హాట్‌గా, స్టైలిష్ ఫిజిక్‌తో ఉంటాడేమో చూడాలి.