ఆ హీరోకి తగిన గుర్తింపు రాలేదు
ఇప్పుడు అలానే తన అభిప్రాయాన్ని చెప్పి జాన్వీ కపూర్ వార్తల్లోకెక్కింది. తన కో యాక్టర్ ఇషాన్ ఖట్టర్ పై జాన్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
సాధారణ ఆడియన్స్ లానే సెలబ్రిటీలకు కూడా ఇష్టాలు, అభిప్రాయాలుంటాయి. అయితే కామన్ పీపుల్ చెప్పిన దాని కంటే సెలబ్రిటీలు చెప్పే మాటలకు, అభిప్రాయాలకు విలువ ఎక్కువ ఉంటుంది. వారేం మాట్లాడినా ప్రతీదీ వార్తే, ప్రతీదీ సెన్సేషనే. ఇప్పుడు అలానే తన అభిప్రాయాన్ని చెప్పి జాన్వీ కపూర్ వార్తల్లోకెక్కింది. తన కో యాక్టర్ ఇషాన్ ఖట్టర్ పై జాన్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిలీజ్ కు ముందే రికార్డులు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తక్కువ టైమ్ లోనే తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకుంది. ఓ వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు టాలీవుడ్ పై కన్నేసిన జాన్వీ.. బాలీవుడ్ హీరో ఇషాన్ ఖట్టర్ తో కలిసి హోమ్ బౌండ్ అనే సినిమా చేసింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
దేశంలోనే టాలెంటెడ్ యాక్టర్లలో ఇషాన్ ఒకడు
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన సహ నటుడు ఇషాన్ ఖట్టర్ గురించి మాట్లాడారు. దేశంలోని టాలెంటెడ్ యాక్టర్లలో ఇషాన్ ఒకడని, కానీ అతనికి ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ సరైన గుర్తింపు దక్కలేదని, కేన్స్ లో ఇషాన్ ను చూడటం, అందరూ అతన్ని పొగడటం చూసి తానెంతో సంతోషించానని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా గుర్తింపొస్తుందని తనకు అప్పుడే అర్థమైందని జాన్వీ చెప్పుకొచ్చింది.
ట్రోల్ చేస్తారని ఎప్పుడూ ఫీలవలేదు
హోమ్ బౌండ్ కథ చాలా గొప్పదని, అందుకే ఈ సినిమా తన కెరీర్ కు ఏ మేర ఉపయోగపడుతుందనేది ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నానని చెప్పింది జాన్వీ కపూర్. ఈ మూవీని కేన్స్ లో ప్రదర్శించినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి షాకయ్యామని, ఆడియన్స్ పై ఆ మూవీ ఎంత ఎఫెక్ట్ చూపిందో అర్థమైందని చెప్పిన జాన్వీ హోమ్ బౌండ్ చేసినందుకు ఆడియన్స్ తనను ట్రోల్ చేస్తారేమో అనే ఫీలింగ్ తనకెప్పుడూ కలగలేదని చెప్పింది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కిన హోమ్ బౌండ్ కు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించగా బెస్ట్ డైరెక్టర్ గా ఆయనకు ఐఎఫ్ఎఫ్ఎంలో అవార్డు దక్కింది.