గుడ్ న్యూస్... జాన్వీ అందాలకు సెన్సార్ పడలేదు
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు కాస్త కఠినంగానే సెన్సార్ కట్స్ ఉంటున్నాయి. కనుక సెన్సార్ కత్తెరకి జాన్వీ కపూర్ ఈ రొమాంటిక్ రెయిన్ డాన్స్ కట్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు.;
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ త్వరలో 'పరమ్ సుందరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పటి వరకు హిందీలో జాన్వీ కపూర్ చాలా సినిమాలు చేసింది. మొదటి సినిమా సమయంలో ఉన్నంత ఆసక్తి ప్రేక్షకుల్లో ఆ తర్వాత కనిపించలేదు. కానీ బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ప్రేక్షకులు జాన్వీ కపూర్ తాజా చిత్రం 'పరమ్ సుందరి' పై చాలా అంచనాలు, ఆసక్తి పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో పరమ్ సుందరి సినిమాకు పెరిగిన బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరమ్ సుందరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు మొదలైన హైప్, ఇటీవల విడుదలైన భీగీ సారి పాటతో పీక్స్‌కి వెళ్లింది. సిద్దార్థ్ మల్హోత్రతో జాన్వీ కపూర్ చేసిన రెయిన్ డాన్స్ తో అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ తడిసి ముద్ద అయ్యారు అనడంలో సందేహం లేదు.
జాన్వీ కపూర్ రెయిన్ డాన్స్
జాన్వీ కపూర్ కెరీర్‌లోనే బెస్ట్ రొమాంటిక్ రెయిన్ డాన్స్‌గా దీన్ని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ పాట యూట్యూబ్ వరకే పరిమితం అవుతుందా.. థియేటర్‌లో చూస్తామా అనే అనుమానంను చాలా మంది వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు కాస్త కఠినంగానే సెన్సార్ కట్స్ ఉంటున్నాయి. కనుక సెన్సార్ కత్తెరకి జాన్వీ కపూర్ ఈ రొమాంటిక్ రెయిన్ డాన్స్ కట్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందారు. సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ రెయిన్ సాంగ్ ను మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో సినిమాలో ఉంచాలని భావించారు. అందుకోసం సెన్సార్ బోర్డ్ ముందు చాలా గట్టిగానే వాదించారు అంటూ హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ పాట పూర్తిగా ఏ సర్టిఫికెట్ వచ్చేది కాదు, కనుక యూ/ఎ ఇవ్వడంతో పాటు 13+ వయసు వారి వరకే అని ప్రత్యేకంగా సెన్సార్ బోర్డ్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
పరమ్ సుందరితో జాన్వీ కపూర్
భీగీ సారి పాటలో సింగిల్ ఫ్రేమ్ కూడా కట్ చేయకుండా సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జాన్వీ కపూర్ యొక్క అభిమానులకు పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. అభిమానులకు మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులకు, ముఖ్యంగా చిత్ర నిర్మాతకు, బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. ఈ రొమాంటిక్ సాంగ్ ఉండటం వల్ల ఖచ్చితంగా సినిమాకు మినిమం ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అందుకే నిర్మాతలు ఈ సినిమాలో ఆ పాట ఉండాల్సిందే అనుకున్నారు, వారు అనుకున్నట్లుగానే పాట ఉండటంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు, బాక్సాఫీస్ సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. ఈ పాటతో సినిమాకు డబుల్ ఇన్‌కమ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రముఖంగా జరుగుతోంది.
రామ్ చరణ్ పెద్దిలో..
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు జాన్వీ కపూర్ కమర్షియల్ బిగ్ బ్రేక్ దక్కే విధంగా హిట్ సినిమాను దక్కించుకోలేక పోయింది. కానీ ఆ లోటును ఇప్పుడు పరమ్ సుందరి సినిమా తీర్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు అంటున్నారు. జాన్వీ కపూర్ తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మరో వైపు జాన్వీ కపూర్ పెద్ది సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పెద్ది సినిమా తర్వాత జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో మరింత బిజీ అండ్ కాస్ట్లీ హీరోయిన్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు, ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.