పిక్‌టాక్ : మతి పోగొట్టే జాన్వీ అందాల షో
ఇటీవల జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ హంస నడక నడిచింది. ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన జాన్వీ కపూర్ చూపు తిప్పుకోనివ్వలేదు.;
జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. బాలీవుడ్‌లో ఈమె నటించిన ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అయినా ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఈ అమ్మడు కొనసాగడంకు కారణం అందం అనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌లోనే చాలా మంది జాన్వీ కపూర్ అందం వల్ల, శ్రీదేవి కూతురు కావడం వల్ల కెరీర్‌లో నెగ్గుకు వస్తుందని అంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఒక్కొక్క ఫోటో షూట్ చూపు తిప్పుకోనివ్వకుడా మతి పోగొడుతూ ఉంటుంది. తాజాగా మరోసారి జాన్వీ కపూర్ అందాల షో తో, ఆకట్టుకునే స్కిన్ షో తో పిచ్చెక్కిస్తోంది.
ఇటీవల జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ హంస నడక నడిచింది. ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన జాన్వీ కపూర్ చూపు తిప్పుకోనివ్వలేదు. లైట్ పింక్ కలర్ ఔట్ ఫిట్ లో జాన్వీ కపూర్ చేసిన రెడ్ కార్పెట్ వాక్‌కి అంతా ఫిదా అయ్యారు. కానీ ఆ సమయంలో జాన్వీ కపూర్ అస్సలు స్కిన్ షో చేయక పోవడంను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. అలాంటి ప్రఖ్యత రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ గ్లామర్ షో చేసి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ సమయంలో చేయని గ్లామర్ షో ఫోటోలను తాజాగా జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తాజా ఫోటో షూట్‌తో మరోసారి జాన్వీ కపూర్ మతి పోగొడుతోంది.
వైట్ కలర్ డ్రెస్‌లో నడుము అందం చూపిస్తూ, థైస్‌ను చూపించి చూపించకుండా భలే చక్కగా కనిపించిన జాన్వీ కపూర్‌కి అంతా ఫిదా అవుతున్నారు. ఇంతటి అందగత్తె కనుకే జాన్వీ కపూర్‌కి హిట్ లేకున్నా ఆఫర్లు వస్తున్నాయని మరోసారి అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ స్థాయిలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో త్వరలోనే ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మగా నిలవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీ కపూర్ షేర్ చేసే ఏ ఫోటో షూట్ అయినా కచ్చితంగా మంచి స్పందన దక్కించుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కిన్ షో ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో దేవర సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమాలో జాన్వీ పాత్ర విషయంలో విమర్శలు వచ్చాయి. ఇంకాస్త ఎక్కువ సీన్స్ జాన్వీ కపూర్ చేసి ఉంటే బాగుండేది అని, ఆమె నటకు ఆస్కారం లేదనే విమర్శలు వచ్చాయి. దేవర విషయంలో జరిగిన తప్పిదం రిపీట్ కాకుండా పెద్ది సినిమాతో జాన్వీ కపూర్ రాబోతుంది. బుచ్చిబాబు కచ్చితంగా మంచి పాత్రను జాన్వీ కపూర్‌కి ఇచ్చి ఉంటాడు. రామ్ చరణ్ వంటి స్టార్‌తో సినిమాను చేసేందుకు రెడీ అయిన నేపథ్యంలో కచ్చితంగా జాన్వీ కపూర్ ఓ రేంజ్‌లో టాలీవుడ్‌లో పెద్ది తర్వాత స్టార్‌డం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు బాలీవుడ్‌లోనూ జాన్వీ కపూర్ బిజీగా ఉంది.