రకుల్ ప్రీత్ సింగ్ కి చేదు అనుభవం.. స్టేజ్ పైనే..

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అప్పుడప్పుడు ఎదురయ్యే చేదు అనుభవాలు వారినే కాదు వారి అభిమానులను కూడా నిరాశకు గురి చేస్తూ ఉంటాయి.;

Update: 2026-02-24 04:17 GMT

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అప్పుడప్పుడు ఎదురయ్యే చేదు అనుభవాలు వారినే కాదు వారి అభిమానులను కూడా నిరాశకు గురి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా ఏకంగా స్టేజ్ పైన చేదు అనుభవం ఎదురవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఒక ప్రైవేటు అవార్డు వేడుకలో ఈ ఘటన ఎదురవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

విషయంలోకి వెళ్తే.. ఒక ప్రైవేట్ అవార్డుల ఫంక్షన్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రముఖ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జగ్జీ అవార్డు తీసుకుంటూ స్టేజ్ పై అసహనంగా కనిపించారు. ఆ వేదికపై అవార్డు తీసుకుంటూ.. కనీసం రకుల్ వైపు కూడా ఆయన చూడకుండా వెళ్లిపోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ ఇబ్బందిగా ఫీలయ్యారు. పైగా ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు జగ్గీ ఎందుకు ఇలా చేశాడు.. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలబ్రిటీ చేత అవార్డు తీసుకోవడం ఒక అరుదైన అవకాశం.. అలాంటిది ఈయన ఎందుకు ఆమె ముఖం కూడా చూడకుండా అవార్డు తీసుకొని వెళ్ళిపోయారు.. అంటూ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు.

అయితే జగ్గీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుపుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా జగ్గీ మాట్లాడుతూ.."నాకంటే ముందు ఒక మహిళ అవార్డు తీసుకోవడానికి వచ్చింది. ఆ సమయంలో ఆ మహిళ రకుల్ ప్రీత్ సింగ్ తో కరచాలనం చేయాలనుకుంటే.. రకుల్ నిరాకరించింది. ఇక నేను కూడా రకుల్ ని చూసి కరచాలనం చేయాలని అనుకుంటే.. ఒకవేళ ఆమె దానికి ఒప్పుకోకపోతే బాధపడాలి కదా.. అందుకే నేనెందుకు బాధపడాలి అని ఆలోచించి.. నా అవార్డును తీసుకొని నేను వెళ్ళిపోయాను" అంటూ జగ్గీ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో జగ్గీ చేసింది కరెక్టే కదా అని వత్తాసు పలుకుతున్నారు.. ఏదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. తర్వాత రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అంటూ పలువురు హీరోల సరసన నటించి భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దగుమ్మ.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు చేరువ అవుతూనే.. తన గ్లామర్ ఫోటోషూట్ తో ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంటుంది.



Tags:    

Similar News