• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిగ్గు శరం లేని వాడినని...

సిగ్గు శరం లేని వాడినని దిగులు పడను: జగపతిబాబు

| లేటెస్టుగా క్యాసినోలో దిగిన ఓ ఫోటోను జగపతిబాబు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో భుజానికి ఇక హ్యాండ్ బ్యాగ్ తగించుకొని స్టైల్ గా నిలిబడి ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-07-18 11:36 GMT

టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జగపతి బాబు.. వీలు కుదిరినప్పుడల్లా పోస్టులు పెడుతూ అభిమానులను పలకరిస్తుంటారు. వేరైటీ క్యాప్షన్లు పెడుతూ అందరినీ నవ్విస్తుంటారు. తనకుసిగ్గూ శరం లేదంటూ తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

లేటెస్టుగా క్యాసినోలో దిగిన ఓ ఫోటోను జగపతిబాబు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో భుజానికి ఇక హ్యాండ్ బ్యాగ్ తగించుకొని స్టైల్ గా నిలిబడి ఉన్నారు. అయితే "సిగ్గు శ‌రం లేద‌ని దిగులు ప‌డ‌ను. కానీ మీరు చెబితే ప‌డ‌తాను" అంటూ పోస్ట్ కింద రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. క్యాసినోలో జగ్గూభాయ్ పోక‌ర్ గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి తనకు క్యాసినోకి వెళ్లే అలవాటు ఉందని జగపతి బాబు గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. ఆ విధంగానే చాలా డబ్బులు పోగొట్టుకున్నట్లుగా చెప్పారు. అయినా సరే మళ్ళీ అలాంటి గేమ్స్ ఆడుతున్నాననే ఉద్దేశ్యంతోనే సీనియర్ యాక్టర్ సిగ్గూ శరం లేదంటూ తనకు తానే తిట్టుకుంటున్నాడని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో సినిమా కోసం వేసిన క్యాసినో సెట్ అయ్యుంటుందిలే అని కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా జగ్గూ భాయ్ పోస్ట్ చేసిన ఫోటో, దానికి ఆయన పెట్టిన క్యాప్షన్ రెండూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక జగపతిబాబు సినిమాల విషయానికొస్తే, 1989లో 'సింహ స్వప్నం' తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన చిత్రాలతో మూడు దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన, ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. హీరోగా కెరీర్ ముగిసిన తర్వాత 'లెజెండ్' సినిమాతో విలన్ అవతారమెత్తారు.

క్యారక్టర్ ఆర్టిస్టుగా జనాలు జగపతి బాబును యాక్సెప్ట్ చేయడంతో, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల కాలంలో 'రుద్రాంగి', 'కాటేరా', 'గుంటూరు కారం' వంటి చిత్రాలతో అలరించారు. 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' చిత్రంలో రాజమన్నార్ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం 'రుస్లాన్' అనే హిందీ సినిమాతో పాటుగా 'కంగువ' వంటి పాన్ ఇండియా మూవీలో జగపతి బాబు నటిస్తున్నారు.

Tags:    
  • Jagapathibabu 
  • Tollywood 
  • Casino 
  • Socialmediaviral 
  • Actor 
  • Senioractor 
  • Latestphoto 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS