• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2… కట్ చేయడం...

ఇండియన్ 2… కట్ చేయడం మొదలైంది!

| కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండియన్ 2 సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది

By - Tupaki Desk
Update: 2024-07-14 08:00 GMT

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండియన్ 2 సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. 1996లో ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిన సేనాపతి పాత్రని మరోసారి శంకర్ ప్రేక్షకులకి పరిచయం చేసి సక్సెస్ కొట్టాలని భావించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 500 కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా శంకర్ ఇండియన్ మూవీ సీక్వెల్ చేశారు.

జూలై 12న పార్ట్ 2 థియేటర్లోకి వచ్చింది. అయితే ఇండియన్ సినిమాతో పోల్చుకుంటే పార్ట్-2 కంటెంట్ దరిదాపుల్లో లేదని మాట వినిపించింది. మూడు గంటల నిడివి ఉండటం కూడా ఇండియన్ 2 సినిమాకి మైనస్ అయింది. చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్న అనవసరమైన సన్నివేశాలు కథాంశంలో ఎక్కువగా ఉండటం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దీంతో స్క్రీన్ ప్లే బోరింగ్ గా ఉందనే అభిప్రాయం సినిమా చూస్తున్న ఆడియన్స్ నుంచి వస్తోంది.

అలాగే ఇండియన్ సినిమాలో ఉన్న ఎమోషనల్ సెంటిమెంట్ ఇండియన్ 2లో మిస్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 నుంచి 20 నిమిషాల్లో నిడివి గల అవుట్ ఫుట్ ని ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలో మూవీలో ఏ సీన్ కూడా తొలగించడానికి వీలు లేకుండా ఉందని, అన్ని పెర్ఫెక్ట్ గా సెట్ కావడంతోనే మూడు గంటల నిడివి ఉంచడం జరిగిందని శంకర్ తెలిపారు.

అయితే సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి పూర్తిగా విరుద్ధమైన రెస్పాన్స్ వచ్చింది. కథాంశంలో అవసరం లేని సన్నివేశాలు చాలా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వినిపించాయి. కథాంశం చాలా బోరింగ్ గా ఉందని రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో శంకర్ అండ్ కో మరోసారి ఇండియన్ 2పై వర్క్ చేసి 20 నిమిషాల నిడివి సీక్వెన్స్ ని తొలగించారంట. ఎడిట్ చేసిన కొత్త వెర్షన్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చినట్లు టాక్ వస్తోంది.

మొదటి, రెండు రోజులు వచ్చిన రెస్పాన్స్, మౌత్ టాక్ ద్వారానే తరువాత సినిమాకి ప్రేక్షకాదరణ పెరుగుతుంది. ఎడిట్ చేసిన కొత్త వెర్షన్ ప్రేక్షకులకి కనెక్ట్ అయిన కూడా పాజిటివ్ టాక్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అనేది చెప్పలేని విషయం. కమల్ హాసన్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అయితే ఆయన క్యారెక్టర్ కి మ్యాకప్ కూడా సరిగా సెట్ కాలేదనే మాట వినిపిస్తోంది.

Tags:    
  • Indian2 
  • Kamalhaasan 
  • Indian3 
  • Shanakr 
  • Rakulpreet 
  • Filmindustry 
  • Indian2runtime 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS