దుబాయ్‌లో సెలబ్రిటీల సొంత ఇంటి కలలు
ప్రపంచ కుభేరుడు, భారతీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దాదాపు 1400 కోట్లతో దుబాయ్ లో విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేయడం అప్పట్లో సంచలన వార్త.;
ప్రపంచ కుభేరుడు, భారతీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దాదాపు 1400 కోట్లతో దుబాయ్ లో విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేయడం అప్పట్లో సంచలన వార్త. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ స్టార్లు దుబాయ్ లో సొంత ఇండ్లు కొనుక్కోవడం చర్చనీయాంశమైంది. గల్ఫ్ తో గొప్ప సంబంధాలను కొనసాగించే కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్- వెటరన్ నటుడు అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, అందాల నటి శిల్పాశెట్టి కుంద్రా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి కూడా దుబాయ్ లో సొంత ఇల్లు ఉందని పుకార్ ఉంది. అలాగే సానియా మిర్జా- షోయబ్ జంటకు దుబాయ్ లో సొంత ఇల్లు ఉందని ప్రచారం ఉంది. అలాగే కీర్తి సురేష్ భర్త కూడా దుబాయ్ లో సెటిలైన వ్యాపారి. అతడికి సొంత ప్రాపర్టీలు ఉన్నాయని కథనాలొచ్చాయి.
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ``కె ఫ్రండ్ ఆఫ్ పామ్ జుమేరా``లో ఒక విల్లాను సొంతం చేసుకున్నాడు. ఇది దుబాయ్ కి చెందిన ప్రాపర్టీ డెవలపర్ అయిన నఖీల్ నుండి బహుమతిగా పొందాడు. షారూఖ్ కి దుబాయ్ రెండవ ఇల్లు లాంటిది. అతని కుటుంబంతో నిరంతరం అక్కడికి విహారయాత్రకు వెళ్లడానికి ఇష్టపడతాడు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ -అభిషేక్ బచ్చన్ దుబాయ్ లో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్టు కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ అభయారణ్యం జలపాతం వద్ద ఒక సొంత భవనాన్ని కలిగి ఉన్నారు. ఇందులో ఛాంపియన్ షిప్ గోల్ఫ్ కోర్సు.. భారీ స్విమ్మింగ్ పూల్ సహా ఇంకా ఎన్నో విలాసాలతో స్వర్గాన్ని తలపిస్తుంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ భారీ భవంతి రిట్జ్ లో 2 బెడ్ రూమ్ ఫ్లాట్ ను కొనుగోలు చేసారు. ఆకాశహార్మ్యాల నగరం దుబాయ్ అంటే అతడికి చాలా ఇష్టం. తన భార్య సునీతా కపూర్ ఈ ఇంటి కొనుగోలుతో ఫుల్ ఖుషీగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ 2013లో దుబాయ్ లో ఒకే అంతస్తులో ఒకటికి మించి అపార్ట్ మెంట్ల ను కొనుగోలు చేశాడు. దుబాయ్ సిగ్నేచర్ రెసిడెన్స్ లోని అపార్ట్‌మెంట్లను కుటుంబ పెట్టుబడిగా కొనుగోలు చేశాడు. సల్మాన్, సోహెయిల్ కి సంబంధించిన ఆస్తులివి. సాగరకన్య శిల్పాశెట్టి 2016లో బుర్జ్ ఖలీఫాలోని రెండు పడకగదుల అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది. తన భర్త పిల్లలతో కలిసి శిల్పాజీ తరచుగా దుబాయ్ కి వెళ్తుంటారు. దుబాయ్ నగరంలో ఖరీదైన ప్యాడ్ వీళ్ల సొంతం. చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వీరంతా అక్కడ తమకంటూ ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసి ఉంటారని కూడా ఊహాగానాలు ఉన్నాయి.