అజిత్ సినిమాకు షాకిచ్చిన ఇళయరాజా
నాలుగు దశాబ్ధాల నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూనే ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఇళయరాజా మూవీస్ లో పెద్ద యాక్టివ్ గా ఉంటడం లేదు.;
ఇండియన్ సినిమాలోని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఇళయరాజా కూడా ఒకరు. కొన్ని వందల సినిమాలు, వేల సాంగ్స్ ను ఆడియన్స్ కు అందించి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నాలుగు దశాబ్ధాల నుంచి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూనే ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఇళయరాజా మూవీస్ లో పెద్ద యాక్టివ్ గా ఉంటడం లేదు.
బాలసుబ్రహ్మణ్యంకు కూడా నోటీసులు
సినిమాల విషయంలో యాక్టివ్ గా లేకపోయినా ఇళయరాజా రెగ్యులర్ గా ఏదొక విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. పర్మిషన్ లేకుండా అతని పాటలు వాడినా, మ్యూజిక్ వాడినా ఏ మాత్రం ఊరుకోవడం లేదు. ఆఖరికి మ్యూజిక్ కాన్సర్టుల్లో అతని సాంగ్స్ ను పాడినా ఒప్పుకోవడం లేదు ఇళయరాజా. అంతెందుకు తనకెంతో క్లోజ్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా ఇళయరాజా లీగల్ నోటీసులు ఇచ్చి అప్పట్లో హాట్ డిస్కషన్ కు తెర దించారు.
ఈ నేపథ్యంలోనే తన పర్మిషన్ లేకుండా ఆయనకు సంబంధించిన మ్యూజిక్ వాడితే ఆయా సినిమాలు, నిర్మాతలకు షాకిస్తూ వారిపై కేసులు పెడుతున్నారు. ఆఖరికి తన మీద అభిమానంతో అతని రిఫరెన్సుని వాడినా కూడా ఊరుకోవడం లేదు. లీగల్ నోటీసులిచ్చి వారిని కోర్టుకి లాగుతూ నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలకు నోటీసులు
ఇప్పటికే చాలా సినిమాలపై కాపీరైట్స్ పేరిట కేసుల వేస్తూ వచ్చిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు తాజాగా మరో సినిమాపై కేసు వేశారు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ నుంచి ఈ ఇయర్ వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అక్కడక్కడా ఇళయరాజా సాంగ్స్ వినిపిస్తాయి. ఆ సాంగ్స్ ను ఆయనపై అభిమానంతోనే వాడినప్పటికీ ఆయన మాత్రం తన పర్మిషన్ లేకుండా వాడినందుకు చిత్ర యూనిట్ పై కేసు వేశారు. సినిమా నుంచి తన సాంగ్స్ ను తీసేయడంతో పాటూ తనకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయగా, సెప్టెంబర్ 8న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. గతంలో కూడా మంజుమ్మల్ బాయ్స్ టీమ్ పై కూడా ఇళయరాజా ఇలానే కోర్టులో ఫైట్ చేసి నష్టపరిమారం ఇప్పించుకున్న సంగతి తెలిసిందే.