టాక్సిక్‌ కోసం డబుల్‌ ఎక్స్‌ఎల్‌ బ్యూటీ

కేజీఎఫ్ తర్వాత యష్‌ నుంచి రాబోతున్న సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-05-23 06:58 GMT

కేజీఎఫ్ తర్వాత యష్‌ నుంచి రాబోతున్న సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఏడాది పాటు ఊరించిన యష్ ఎట్టకేలకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు.


వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమాకు 'టాక్సిక్‌' అనే విభిన్నమైన టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ గురించి గత కొన్ని రోజులుగా ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఖాన్ ను కీలక పాత్ర కోసం సంప్రదించారు అనే వార్తలు వచ్చాయి. ఆమె బిజీ షెడ్యూల్‌ కారణంగా మరో హీరోయిన్ తో సంప్రదింపులు జరిపారట.

బాలీవుడ్ మరో స్టార్‌, డబుల్‌ ఎక్స్‌ఎల్‌ బ్యూటీ అయిన హుమా ఖురేషి ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమెను కరీనా కపూర్ ఖాన్‌ స్థానంలో కాకుండా మరో పాత్రకు గాను సంప్రదించారు అంటూ కన్నడ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలంలో హుమా ఖురేషి సౌత్‌ లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఐటెం సాంగ్స్ తో అదరగొడుతున్న హుమా ఖురేషి కి టాక్సిక్‌ లో మంచి పాత్ర దక్కిందని సమాచారం అందుతోంది. మరి ఈ అవకాశంను ఎంత వరకు హుమా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News