షారుఖ్ సినిమాతో డైరెక్ట‌ర్ ఏడుపు

ఈ సినిమా ద్వారా త‌న తండ్రి సంపాదించిన‌ది మొత్తం కోల్పోయార‌ని, కోయ్లా త‌ర్వాత త‌న తండ్రి చాలా క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌ని హృతిక్ పేర్కొన్నాడు.;

Update: 2025-06-03 06:51 GMT

షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షితి, అమ్రీష్ పూరి ప్ర‌ధాన పాత్ర‌ల్లో రాకేష్ రోష‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కోయ్లా. 1997లో భారీ స్టార్ క్యాస్టింగ్ తో వ‌చ్చిన ఈ థ్రిల్ల‌ర్ సినిమాను రాకేష్ రోషనే నిర్మించారు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించని ఫ‌లితాన్ని అందుకుంది. ఇప్పుడు కోయ్లా సినిమాను 90ల నాటి క్లాసిక్ సినిమాగా చెప్తున్నారు కానీ ఆ రోజుల్లో ఎవ‌రూ ఈ సినిమాను ప‌ట్టించుకోలేదు.

కోయ్లా సినిమా వ‌ల్ల త‌న తండ్రి రాకేష్ రోష‌న్ జీవితం కోలుకోలేని స్థితిలోకి వెళ్లింద‌ని హృతిక్ రోష‌న్ గ‌తంలో మాట్లాడిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది. కోయ్లా మూవీ అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోవ‌డంతో త‌న తండ్రి ఏడ‌వ‌డం మొద‌టిసారి చూశాన‌ని హృతిక్ రోష‌న్ ఆ వీడియోలో వెల్ల‌డించాడు. కోయ్లా సినిమాకు త‌న తండ్రి చాలా ఖ‌ర్చు పెట్టాడ‌ని హృతిక్ చెప్పాడు.

ఈ సినిమా ద్వారా త‌న తండ్రి సంపాదించిన‌ది మొత్తం కోల్పోయార‌ని, కోయ్లా త‌ర్వాత త‌న తండ్రి చాలా క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నార‌ని హృతిక్ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోలో ఎక్క‌డా హృతిక్.. షారుఖ్ పేరు కానీ, అత‌న్ని ఉద్దేశించి కానీ మాట్లాడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి ఫ్యాన్స్ మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయి. త‌న తండ్రి ఫేస్ చేసిన ఇబ్బందుల‌న్నింటికీ హృతిక్ షారుఖ్ ను నిందిస్తున్నాడ‌ని షారుఖ్ ఫ్యాన్స్ హృతిక్ మాట‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు.

షారుఖ్ ఖాన్, రాకేష్ రోష‌న్ ఇప్ప‌టికీ మంచి బాండింగ్ ను క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ, వారిద్ద‌రూ క‌లిసి చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాపులుగానే నిలిచాయి. కోయ్లా సినిమా 90స్ లో వ‌చ్చిన క్లాసిక్ గా ఇప్పుడు ఎక్కువ మంది చూస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న‌ప్ప‌టికీ ఈ సినిమాతో షారుఖ్ త‌న డైరెక్ట‌ర్ ను ఏడిపించాడ‌నే ముద్ర మాత్రం అతనిపై పడిపోయింది. అయితే ఓ సినిమా తీయాలంటే నిర్మాత‌ల‌కు ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతాయి. సినిమా మొత్తం అయిపోయాక అందులో న‌టీనటుల‌ను వారి యాక్టింగ్ ను మెచ్చుకుంటారు కానీ తెర వెనుక నిర్మాత‌ల క‌ష్టాన్ని, వారి స‌వాళ్ల‌కు మాత్రం ఇప్ప‌టికీ గుర్తింపు లేకుండా పోతుంది.

Tags:    

Similar News