రెండు క్లైమాక్సులు కన్ఫ్యూజ్ చేయవా?
ఇటీవలే `హౌస్ ఫుల్` ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా ట్రైలర్ విడుదలై బంపర్ హిట్టయింది. ఈ ట్రైలర్ సినిమాపై ఉత్కంఠను పెంచింది.;
ఇటీవలే `హౌస్ ఫుల్` ఫ్రాంఛైజీ నుంచి కొత్త సినిమా ట్రైలర్ విడుదలై బంపర్ హిట్టయింది. ఈ ట్రైలర్ సినిమాపై ఉత్కంఠను పెంచింది. ఒక గంటలోపు ఇది 9 లక్షల వీక్షణలను పొందింది. ఇది 163 నిమిషాల రన్‌టైమ్‌తో హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో సుదీర్ఘ నిడివి ఉన్న చిత్రమని తెలుస్తోంది.
జూన్ 6న సినిమా రిలీజ్ కానుండగా, ఈ సస్పెన్స్ మిస్టరీ, కామెడీ డ్రామా సినిమాకి రెండు క్లైమాక్సులు ఉంటాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులో చివరి వరకూ హంతకుడు ఎవరు? అనేది ఎవరికీ తెలీదట. ఇలాంటి సస్పెన్స్ ఇంతకుమునుపు ఎన్నడూ ప్రేక్షకులు అనుభవించి ఉండరు అని చెబుతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ ,అభిషేక్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు.
ఆసక్తికరంగా ఈ సినిమాని హౌస్‌ఫుల్ 5 , హౌస్‌ఫుల్ 5A అనే రెండు పేర్లతో రిలీజ్ చేస్తారట. ఈ చిత్రానికి రెండు క్లైమాక్సులు ఉన్న విషయాన్ని సాజిద్ నడియాడ్ వాలా స్వయంగా రివీల్ చేయడం ఆసక్తిని పెంచింది. ఒక రకంగా రెండు క్లైమాక్సులు అనే కాన్సెప్ట్ నిజంగా ఆశ్చర్యం కలిగించేది. మిస్టరీ థ్రిల్లర్ హాలీవుడ్ రేంజులో ప్రేక్షకుల్ని కుర్చీ అంచుకు కట్టిపడేస్తుందని చెబుతున్నారు. అయితే రెండు క్లైమాక్సులు దేనికి? అంటే... కచ్ఛితంగా దక్షిణాది ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని క్లైమాక్స్ కి రెండో ఆప్షన్ ఇచ్చారా? అన్న చర్చా సాగుతోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకే మేకర్స్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. మరో ఐదారు రోజులు ఆగితే దీనిపై థియేటర్లలోనే ఆడియెన్ కి క్లారిటీ వచ్చేస్తుంది. వెయిట్ అండ్ సీ..