హిట్ 3ని హిట్ చేయాల్సిన బాధ్యత వాళ్లదే..!
హిట్ 3 విషయంలో కూడా నాని కాన్ ఫిడెన్స్ అదే అనిపిస్తుంది. ఎవరైతే థ్రిల్లర్ సినిమాలు చూస్తారో వాళ్లకి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని అంటున్నాడు.;
శైలేష్ కొలను హిట్ యూనివర్స్ లో భాగంగా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా హిట్ 3. నాని నిర్మాతగా, హీరోగా రెండు బాధ్యతలను ఒకే సినిమాకు చేసిన ప్రాజెక్ట్ ఇది. అందుకే రిలీజ్ ప్రమోషన్స్ ని కూడా డబుల్ ఎనర్జీతో చేస్తున్నాడు. అఫ్కోర్స్ నాని నిర్మాత కాకపోయినా కూడా తన ప్రతి సినిమాకు ఇదే రేంజ్ ప్రమోషన్స్ చేస్తాడని తెలిసిందే. నాని హిట్ 3 సినిమా మే 1న వస్తుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా కేవలం పెద్ద వాళ్లకి మాత్రమే అని చెబుతున్నారు.
హిట్ 3 సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఇలాంటి జోనర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ చాలా తక్కువమంది ఉంటారు. ముందు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ టైప్ సినిమాలు చూడటానికి ఇష్టపడరు. యూత్ ఆడియన్స్ కూడా కొంతమంది మితిమీరిన వైలెన్స్ ని చూడటానికి ఇష్టపడరు. కానీ హిట్ 3 విషయంలో నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
హిట్ 3 ని హిట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఎవరైతే క్రైం థ్రిల్లర్ సినిమాలు చూసి ఎంకరేజ్ చేస్తారో వాళ్లది. అంతేకాదు అన్యాయం పట్ల అర్జున్ సర్కార్ లా చేయాలని అనుకునే వారంతా చూడాలి. ఇదే మోటోతోనే నాని అండ్ టీం హిట్ 3 చేశారు. ఐతే సినిమాలో బ్లడ్ బాత్ సీన్స్ ఏదో కావాలని చేసినట్టు కాకుండా అందుకు తగిన మంచి ఎమోషన్ ఉంటుందని నాని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేముందు తను ఒక ఆడియన్ లా చూసి ఎంజాయ్ చేస్తాడు, జడ్జ్ చేస్తాడు కాబట్టే నాని సక్సెస్ రేటు అలా ఉంది.
హిట్ 3 విషయంలో కూడా నాని కాన్ ఫిడెన్స్ అదే అనిపిస్తుంది. ఎవరైతే థ్రిల్లర్ సినిమాలు చూస్తారో వాళ్లకి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని అంటున్నాడు. అంతేకాదు నాని ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని ఊరిస్తున్నాడు. ఆల్రెడీ కార్తీ క్యామియో ఉందని లీక్ అవ్వగా అది ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్ మెంట్ ఉంది. సో మే 1న నాని హిట్ 3 ఈ ఫ్రాంచైజీ ఫలితాలను రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. నాని సెంటిమెంట్ ప్రకారం రాజమౌళి వచ్చి సినిమాను ఎంకరేజ్ చేశాడు కాబట్టి హిట్ 3 కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.