స్టోరీ ఒకే అయితే స్టార్స్ తో పని లేని భామలు!
లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించే తీరు గురించి చెప్పాల్సిన పనిలేదు.;
లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించే తీరు గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ చుట్టూనే కథ అంతా తిరుగుతుంది కాబట్టి? పక్కన కోస్టార్స్ విషయంలో ఎలాంటి నిబంధనలు లేకుండా పనిచేస్తుంటారు. స్వీటీ అనుష్క అలాంటి సినిమాలు చాలానే చేసింది. మహానంది, అరుంధతి, పంచాక్షరి, భాగమతి లాంటి సినిమాలు చేసింది. ఇవన్నీ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రాలు.
వాటిలో ఆమెకు భర్తగా, ప్రియుడిగా రకరకాల నటులు కనిపించారు. వాళ్లెవ్వరు పెద్దగా ఫేమస్ కాదు. తాజాగా 'ఘాటీ' తెరకెక్కుతోంది. ఇదీ లేడీ ఓరియేంటెడ్ చిత్రం. కానీ ఇందులో అనుష్క కు జోడీగా తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అది ప్రియుడు పాత్ర అవ్వొచ్చు...భర్త రోల్ కావొచ్చు. పాత్ర ఏదైనా ఆ రెండు పాత్రల మధ్య కొంత రొమాన్స్ ఉంటుంది. కీర్తీ సురేష్ కూడా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు ఎక్కువ గానే చేసింది.
`మహానటి`తో వచ్చిన గుర్తింపుతో అంతే ప్రోఫెషనల్ గా కనిపించాలనుకుంది. ఈ క్రమంలో చాలా సినిమాలు చేసింది. 'భోళా శంకర్' లో చిరంజీవికి చెల్లెలు పాత్ర కూడా పోషించింది. కథ, పాత్రలు నచ్చితే కోస్టార్స్ తో పనిలేకుండా ముందుకెళ్లే మరో నటి కీర్తి. ప్రస్తుతం ఉప్పుకప్పురంబు అనే కీర్తి సురేష్ `ఉప్పుకప్పు రంబు `అనే ఓటీటీ సిరీస్ చేస్తోంది. ఇందులో సుహాస్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సుహాస్ సరసన నటించే సరికి చర్చకు దారి తీస్తోంది. 'రఘుతాత', గుడ్ లక్ సఖి' లాంటి చిత్రాల్లో కీర్తి కి జోడీగా కొంత మంది చిన్న స్టార్స్ నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మంద న్నా కూడా ఇలాంటి విషయాల్లో ఎలాంటి నిబంధనలుండవ్. కథ నచ్చితే కోస్టార్స్ తో పని లేదంటుంది. ప్రస్తుతం అమ్మడు ప్రధాన పాత్రలో `రెయిన్ బో` తెరకెక్కుతోంది. ఇందులో దేవ్ మోహన్ పక్కన కనిపించ నుంది రష్మిక. అలాగే సమంత కూడా ఇలాంటి చిత్రాలు కొన్ని చేసిన సంగతి తెలిసిందే.