సంచలన వెబ్ సిరీస్ లో తమన్నా-కాజల్!
కానీ రిలీజ్ అయిన తర్వాత ఫలితం అన్నింటిని పటా పంచల్ చేసింది. తన కళా ఖండంతో ప్రేక్షకుల్ని ఓ సరికొత్త ప్రపంచంలో విహరించేలా చేసాడు సంజయ్.;
మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అతిది రావు హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్ ఇలా బాలీవుడ్ భామలందర్నీ ఒకే ప్రేమ్ లో `హీరామండి: ది డైమండ్ బజార్` లో సంజయ్ లీలా భన్సాలీ ఎంత అందంగా..అద్భుతంగా ఆవిష్కరిం చాడో చెప్పాల్సిన పనిలేదు. తొలి భాగం సీజన్ లో ఒక్కో పాత్ర ఒక్కో ఆణిముత్యంలా హైలైట్ అయింది. అందాల తారలంతా ఆ కథలో మహారాణుల్లా అలరించారు. ఓ పాత కథని సంజయ్ చెప్పడంతో ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అవుతుందా? లేదా? అని రిలీజ్ కు ముందు ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి.
సీక్వెల్ సన్నాహాల్లో సంజయ్ లీలా భన్సాలీ:
కానీ రిలీజ్ అయిన తర్వాత ఫలితం అన్నింటిని పటా పంచల్ చేసింది. తన కళా ఖండంతో ప్రేక్షకుల్ని ఓ సరికొత్త ప్రపంచంలో విహరించేలా చేసాడు సంజయ్. తాజాగా ఇప్పుడీ సిరీస్ కు సీక్వెల్ కూడా ముస్తాబవుతుంది. మరికొన్ని రోజుల్లో సీక్వెల్ పట్టాలెక్కుతుందని రచయితల్లో ఒకరైన విభుపూరి తెలిపారు. ప్రస్తుతం సీక్వెల్ స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తాం అన్నారు. సీక్వెల్ లో యధావిధిగా పాత పాత్రలు కొనసాగుతాయి. అయితే వాటితో పాటు, మరికొన్ని కొత్త పాత్రలు యాడ్ కానున్నాయి.
సౌత్ మార్కెట్ కోసమా?
ఈ నేపథ్యంలో రెండు పాత్రలకు సౌత్ లో ఎంతో ఫేమస్ అయిన మిల్కీబ్యూటీ తమన్నా, చందమామ కాజల్ అగర్వాల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ రెండు పాత్రలు కూడా తొలి భాగం పాత్రలకు ధీటుగా మలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి వీరిదర్నీ ఎంపిక చేసుకోవడానికి ఓ కారణం కూడా వినిపిస్తోంది. సౌత్ లో మరింతగా` హీరామండి` కనెక్ట్ అవ్వాలంటే కాజల్, తమన్నా లాంటి వారి సహకారం అవసరమని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ పరంగా ఇద్దరు సీక్వెల్ కు ప్లస్ అవుతారు.
ఆ భామలకు తగ్గ నటీమణులే:
ఇద్దర్నీ కూడా ఆ పాత్రలకు పర్పెక్ట్ ఛాయిస్ గానూ సంజయ్ భావిస్తున్నాడుట. ఇప్పటికే సౌత్ లో తమన్నా, కాజల్ అగర్వాల్ నటులుగా ఎగ్జిట్ అయ్యారు. అప్పుడప్పుడు అవకాశాలు వస్తే నటించడం తప్ప! మునుపటిలా ప్రయాణం చేయడం లేదు. ఇలాంటి తరుణంలో హీరామండి లాంటి సిరీస్ లో ఛాన్స్ అంటే గొప్ప అవకాశంగానే భావించొచ్చు. ఇలాంటి సిరీస్ లు వాళ్ల కెరీర్ కు ఎంతో దోహదం చేస్తాయి. హీరోయిన్లగా, ఐటం భామలగా కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ సత్తా చాటారు. కాజల్ వయసు ఇప్పటికే 40 దాటగా, తమన్నా 35 క్రాస్ చేసింది. `హీరామండి`లో ఇప్పటికే భాగమైన వారి వయసు కూడా 35 నుంచి 40 ఏళ్లు పైబడిన వారే. వారందరికీ తమన్నా, కాజల్ సరితూగే నటులే.