మ‌రో 10 ఏళ్ల కెరీర్ ప్లాన్ చేసిన బ్యూటీ!

హెబ్బా ప‌టేల్ అలియాస్ కుమారి టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమాతో యూత్ పుల్ బ్యూటీగా ఫేమ‌స్ అయింది.;

Update: 2025-04-04 05:49 GMT

హెబ్బా ప‌టేల్ అలియాస్ కుమారి టాలీవుడ్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమాతో యూత్ పుల్ బ్యూటీగా ఫేమ‌స్ అయింది. తొలి చిత్రం స‌క్సెస్ తో చాలా అవ‌కాశాలు అందుకుంది. వాటిలో విజ‌యాల సంగ‌తి ప‌క్క‌న బెడితే న‌టిగా మాత్రం తాను ఏ పాత్ర‌కి అన్యాయం చేయ‌లేదు. న‌టిగా పూర్తిగా న్యాయం చేసింది. ఎలాంటి పాత్ర వ‌చ్చినా? కాద‌న‌కుండా చేసింది.

నిర్మాత‌ల‌కు పారితోషికం ప‌రంగానూ మ‌రీ బెట్టు చేసింది కూడా లేదు. అలా కుమారిపై ఓ పాజిటివ్ ఇంప్రెష‌న్ ఉంది. ఒకానొక ద‌శ‌లో అవ‌కాశం క‌ష్టం అనుకున్నా మ‌ళ్లీ అమ్మడు పుంజుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే ఐటం పాట‌ల్లోనూ న‌టిస్తూ స‌త్తా చాట‌డం అద‌నంగా క‌లిసొచ్చింది. ప‌దేళ్ల కెరీర్ లో చాలా సినిమాలు చేసింది. గ‌త ఏడాది నాలుగు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం విల‌న్, ఆద్య‌, 'ఓదెల 2' లో న‌టిస్తోంది.

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న `ఓదెల‌2`పై మాత్రం మంచి అంచ‌నాలున్నాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ లో అమ్మ‌డు మ‌రో ప‌దేళ్ల పాటు న‌టిగా కొన‌సాగుతాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది. విజ‌యాలు, ప‌రాజయాలు ఏవీ శాశ్వ‌తం కాదంటుంది. ప‌ని చేస్తూ వెళ్ల‌డం పైనే దృష్టి పెడ‌తాన‌ని...ఇంత వ‌ర‌కూ త‌న కెరీర్ ముందుకు సాగిందంటే? కార‌ణం అలా నిర్విరామంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల‌నే అంది.

ప‌దేళ్ల కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కున్న‌ట్లు గుర్తు చేసుకుంది. అయినా ఏ నాడు వెర‌వ లేద‌ని.. .ఎలాంటి స‌వాళ్లు ఎదురైనా స్వీక‌రించి ముందుకు సాగిన‌ట్లు తెలిపింది. ఏ రంగంలోనైనా ప్ర‌తికూల ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌ని వాటికి భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గితే జీవితంలో ముంద‌డుగు ప‌డ‌ద‌ని తెలిపింది.

Tags:    

Similar News