అవును.. క్రిష్ కథలో మార్పులు చేశా.. ఎందుకంటే?: జ్యోతి కృష్ణ

క్రిష్ మొత్తం సినిమా డైరెక్ట్ చేసి ఉంటే అవుట్ పుట్ వేరే లా ఉండేదని కామెంట్స్ పెడుతున్నారు. జ్యోతి కృష్ణ చేసిన మార్పులు వల్ల అలా అయిందని ఆరోపిస్తున్నారు.;

Update: 2025-07-28 04:26 GMT

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా జులై 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. అంతకుముందు రోజు రాత్రి ప్రీమియర్స్ షోస్ కూడా పడ్డాయి.

అయితే మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎం రత్నం నిర్మించిన వీరమల్లు చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. తొలుత క్రిష్ సినిమాను రూపొందించగా.. మధ్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. మూవీని పూర్తి చేసి ఎట్టకేలకు విడుదల చేశారు.

అదే సమయంలో సినిమా రిలీజ్ అయ్యాక. ఫస్టాఫ్ తో పాటు ఇంటర్వెల్ బాగుందని, కానీ సెకండాఫ్ తేడా కొట్టిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిష్ మొత్తం సినిమా డైరెక్ట్ చేసి ఉంటే అవుట్ పుట్ వేరే లా ఉండేదని కామెంట్స్ పెడుతున్నారు. జ్యోతి కృష్ణ చేసిన మార్పులు వల్ల అలా అయిందని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఆ విషయంపై జ్యోతి కృష్ణ రెస్పాండ్ అయ్యారు. తాను వీరమల్లు స్టార్టింగ్ నుంచి ఉన్నానని, ఇప్పుడు సినిమా రిలీజైంది కాబట్టి మాట్లాడుతున్నట్లు తెలిపారు. కోహినూర్‌ ప్రధానాంశంగా సాగే కథతో ఫన్ ఫిల్మ్‌ గా క్రిష్ రూపొందించాలని భావించారని, మాయా బజార్‌ స్టైల్‌ లో తీయాలని క్రిష్ అనుకున్నట్లు చెప్పారు.

అలానే సినిమా స్టార్ట్ అయిందని, యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాక కొవిడ్ వచ్చినట్లు తెలిపారు. మళ్లీ మళ్లీ మరో యాక్షన్‌ సీక్వెన్స్‌ తీశాక రెండో వేవ్ వచ్చిందని, ఆ తర్వాత వరుస బ్రేక్స్ వచ్చాయని తెలిపారు. అప్పుడు తన కోసం ఏడాది వెయిట్ చేసిన క్రిష్.. ఆ తర్వాత ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులు ఉండడంతో తప్పుకున్నారని తెలిపారు.

అప్పుడు కథను రెండు పార్టులుగా తీస్తానని పవన్‌ కు వివరించగా, ఆయన ఓకే చెప్పారని.. అలా తన జర్నీ ప్రారంభమైందని తెలిపారు. తాను మొదటి భాగం కథలో మార్పులు చేశానని, క్రిష్ అనుకున్న కోహినూర్‌ కథ పార్ట్‌ 2లో ఉంటుందని తెలిపారు. కోహినూర్‌ కోసం అసలేం జరిగిందనేది సీక్వెల్ లో చూపించనున్నామని చెప్పారు. అలా క్లారిటీ ఇచ్చారు జ్యోతి కృష్ణ.

Tags:    

Similar News