హరహర వీరమల్లుకు ప్రీమియర్స్.. ఫస్ట్ షో ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమలుపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2025-07-19 09:58 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు జ్యోతికృష్ణ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ జూలై 24న గ్రాండ్ గా విడుదల కానుంది. గత రెండు సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు చివరికి విడుదలకు రెడీ అయింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై అభిమానుల్లో మంచి హైప్ నెలకొంది.

ఈ సినిమాను మేగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. టీజర్లు, పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. పవన్ కళ్యాణ్‌ లుక్, యాక్షన్, డైలాగ్ డెలివరీపై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ తరుణంలో, మేకర్స్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

అంతే కాదు.. తాజా సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలకు ముందు రోజే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జూలై 23న రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షోలు పెట్టేందుకు మేకర్స్ అధికారికంగా ప్రభుత్వం వద్ద అనుమతి కోరారు. ప్రత్యేకంగా చేసిన ఈ విజ్ఞప్తికి ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఏపీ అభిమానులు దేశంలోనే తొలిగా ఈ సినిమాను చూస్తారు. దీనివల్ల సినిమా బజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతుండగా, ఏపీలో ప్రీమియర్ షోలు పెట్టాలనే ఆలోచనతో ముందుకు రావడం మేకర్స్ క్లారిటీని చూపిస్తోంది. పవన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. పైగా ఇది చారిత్రక చిత్రమన్న నేపథ్యంలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు.

ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే.. రాత్రి 9:30 ప్రీమియర్ షోల ద్వారా ఫ్యాన్స్ ఫెస్టివల్ బలంగా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో టికెట్లు చాలా వేగంగా అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. మొత్తానికి, హరిహర వీరమల్లుకు సంబంధించి మరో మంచి హైప్ అయితే ఉంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 21న్ హైదరాబాద్ శిల్పాకలా వేదికలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు త్రివిక్రమ్, రాజమౌళి స్పెషల్ గెస్ట్ లుగా హాజరుకానున్నారు.

Tags:    

Similar News