'ఫౌజీ' తర్వాత బాలీవుడ్ కి వెళ్తున్నాడా?
అతడిలో ప్రతిభను గుర్తించే డార్లింగ్ ప్రభాస్ మరో ఆలోచన లేకుండా ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో `ఫౌజీ` భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
`సీతారామం` సక్సెస్ హను రాఘవపూడి కెరీర్ నే మార్చేసింది. అప్పటి వరకూ రీజనల్ మార్కెట్ లో నాలుగైదు సినిమాలు చేసిన హను రాఘవపూడి `సీతారామం` విజయంతో పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు. కొన్ని వాస్తవ సంఘటనలు స్పూర్తిగా తీసుకుని తెరకెక్కించిన సినిమాకు పాన్ ఇండియాలో మంచి ఫలితాలు సాధించింది. 30 కోట్ల బడ్ఎట్ లో నిర్మించి 100 కోట్ల వసూళ్లను సాధించాడు. అప్పటికే హను రాఘవపూడి వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. అవకాశాలు కూడా కష్టం అనుకున్న సమయంలో `సీతారామం` కథతో దుల్కర్ సల్మాన్ ని ఒప్పించాడు. అతడి కథను నిర్మాతలు స్వప్నా దత్ , ప్రియాంక దత్ బలంగా నమ్మడంతోనే అంత గొప్ప విజయం సాధ్యమైంది.
అతడిలో ప్రతిభను గుర్తించే డార్లింగ్ ప్రభాస్ మరో ఆలోచన లేకుండా ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో `ఫౌజీ` భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథను తెరకెక్కిస్తున్నాడు. భారీ వార్ సన్నివేశాలతో పాటు, అదే కథలో అద్భుతమైన ప్రేమకథను హైలైట్ చేస్తున్నాడు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది ఆగస్టులో చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి ఏ హీరోతో సినిమా చేస్తాడు? అనే చర్చ అప్పుడే మొదలైంది.
`పౌజీ` గ్యారెంట్ హిట్ అనే టాక్ నేపథ్యంలో హను తదుపరి హీరో ఎవరు? అంటూ సర్వత్రా చర్చకొస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. `ఫౌజీ` అనంతరం హను రాఘవపూడి బాలీవుడ్ తో హీరోతో సినిమా చేయనున్నాడని తెలిసింది. షాహిద్ కపూర్ కు ఓ స్టోరీ వినిపించాడుట. నచ్చడంతో అతడు కూడా ఒకే చెప్పినట్లు వినిపిస్తోంది. తెలుగు-హిందీ నిర్మాణ భాగస్వామ్యంలోఈ చిత్రాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకుం టున్నారుట. అదే నిజమైతే తెలుగు, హిందీలోనే సినిమా చేసే అవకాశాలున్నాయి. కొంత కాలంగా బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిందంటే? సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇక్కడ మేకర్స్ ఉత్తమంగా పనిచేస్తున్నారు అనే పాజిటివ్ ఇంప్రెషన్ బాలీవుడ్ హీరోల్లో బలంగా ఉంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లే తెలుగు దర్శకుల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి అవకాశం వాళ్లకు రాకపోయినా? షాహిద్ కపూర్ కి హను రాఘవపూడి రూపంలో వస్తోంది. టాలీవుడ్ మేకర్స్ తో పని చేయడం షాహిద్ కి కొత్తేం కాదు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగతో `అర్జున్ రెడ్డి` రీమేక్ లో నటించాడు. అంతకు ముందు `జెర్సీ` రీమేక్ కోసం గౌతమ్ తిన్ననూ రితోనూ పని చేసిన వారే. ఈ రెండు సినిమాలతో తెలుగు వారు ఎంతటి ప్రతిభావంతులు అన్నది షాహిద్ కి ఐడియా ఉంది.