తార‌క్ త‌దుప‌రి చిత్రం చిక్కు వీడేనా?

దీనిపై తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మే 20న అయినా క్లారిటీ వ‌స్తుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.;

Update: 2026-03-12 17:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న సినిమా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ ర‌క‌మైన ప్ర‌ణాళిక‌తోనే ప్ర‌శాంత్ నీల్ ముందుకెళ్తున్నాడు. అయితే ఈ సినిమా త‌ర్వాత తార‌క్ ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తాడు? అన్న‌దే మిస్ట‌రీగా మారింది. దీనిపై తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మే 20న అయినా క్లారిటీ వ‌స్తుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తార‌క్ అభిమానులకు మే 20 వ తేదీ అంటే ఓ పండ‌గ లాంటింది.

అందులోనూ ఈ బ‌ర్త్ డే మ‌రింత ప్ర‌త్యేక‌మ‌ని చెప్పాలి. ప్ర‌శాంత్ నీల్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉండే అవ‌కాశం ఉంది. అదీ గ్లింప్స్ లేదా? టీజ‌ర్ రూపంలో వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో పాటు కొత్త సినిమా వివ‌రాలు కూడా తార‌క్ అందిస్తార‌ని అభిమానులు అంతే ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. స‌న్నిహిత వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం చూస్తే? `డ్రాగన్` తర్వాత ఎన్టీఆర్ లైనప్‌లో ముగ్గురు దిగ్గజ దర్శకుల ప్రముఖంగా క‌నిపిస్తున్నారు. అందులో ఒకరు త్రివిక్ర‌మ్ కాగా, మ‌రొక‌రు సందీప్ రెడ్డి వంగా. ఇంకొక‌రు వెట్రిమారన్‌. త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ విష‌యంలో చాలా గంద‌రగోళం ఉంది.

ఆయ‌న రాసిన మైథ‌లాజికల్ స్టోరీ బ‌న్నీ-తార‌క్ చుట్టూ తిరుగుతుంది. వీరిలో ఎవ‌రు ఫైన‌ల్ అవుతారు? అన్న‌ది అప్పుడే తేలేలా లేదు. తెగించి తార‌క్ ముందుకొస్తే మే 20న కొత్త అప్ డేట్ అదే అవ్వొచ్చు. అలాగే వెట్రీమార‌న్ కూడా ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని ముందుకొస్తున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు సందీప్ రెడ్డి వంగ తోనూ ప‌ని చేయాల‌ని తార‌క్ ఆసక్తిగా ఉన్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ ఎల్ సీయూ లోకి తారక్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇద్దరి మధ్య కొన్ని దఫాలుగా చర్చలు జరిగాయని వార్త‌లొచ్చాయి.

మ‌రి వీరంద‌రిలో తార‌క్ మైండ్ లో ఉన్న మొద‌టి డైరెక్ట‌ర్ ఎవ‌రు? అన్న‌ది బ‌ర్త్ డే సంద‌ర్భంగా చెబుతారా? అన్న‌ది చూడాలి. అలాగే తార‌క్ సినిమా క‌మిట్ అయ్యే ముందు డైరెక్ట‌ర్ల షెడ్యూల్స్ కూడా అంతే కీల‌కం. వారిలో ఎవ‌రు స్టోరీతో సిద్దంగా ఉన్నారు? అన్నది కీల‌క‌మే. తార‌క్ ముందుకొచ్చి డైరెక్ట‌ర్ సిద్దంగా లేక‌పోయినా? కాంబినేష‌న్ డిలే అవుతుంది.

Tags:    

Similar News