టాలీవుడ్ లో అనుష్క మ‌రోటి లాక్ చేసిందా?

అనుష్క శెట్టి కెరీర్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-12 16:30 GMT

అనుష్క శెట్టి కెరీర్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `ఘాటి` బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, అనుష్క సినిమాలకు స్వస్తి చెబుతుంద‌నే వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కేవ‌లం తెలుగు సినిమాల‌కే దూరం అవుతుంద‌ని ఇత‌ర భాష‌లు స‌హా కొత్త ప‌రిశ్ర‌మ‌ల్లో లాంచ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఏంత మాత్రం నిజం లేదని తేలిపోయింది. అనుష్క తెలుగులో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

అనుష్క కెరీర్ విష‌యంలో స్పష్టమైన దృక్పథంతో ఉన్నారు. ఒక్క పరాజయం ఎదురైనంత మాత్రాన వెనకడుగు వేసే నటి కాదు. తాజాగా సమాచారం ప్రకారం లేడీ డైరెక్ట‌ర్ నందిని రెడ్డి చెప్పిన స్టోరీకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. కథలోని వైవిధ్యం, ఆమె పాత్రలోని లోతు నచ్చడంతో షూటింగ్ కోసం కాల్‌షీట్లు కేటాయిం చినట్లు వినిపిస్తోంది. సినిమాలో అమ్మ‌డు సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నారుట‌. సోషల్ డ్రామా విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కూడిన క‌థగా తెలిసింది. మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకోవడంలో అనుష్క ఎప్పుడూ ముందుంటారు.

`అరుంధతి, `భాగమతి` చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండ‌బోతుంది. నందినీ రెడ్డి ఈ కథను డీల్ చేసే విధానం కొత్తగా ఉండబోతోందట‌. ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలున్న‌ క‌థ‌ను తెర‌కెక్కించ‌డం నందిని రెడ్డికి కొత్త అనుభ‌వం అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నందిని రెడ్డి స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `మా ఇంటి బంగారం` అనే సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. మిగ‌తా ప‌నులు పూర్తి చేసి మేలో చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. వాస్త‌వానికి నందిని రెడ్డి కొంత కాలంగా ప్లాప్ ల్లోనే ఉన్నారు.

అయినా స‌మంత న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చారు. అయితే స‌మంత‌కు గ‌తంలో నందిని రెడ్డి `యూట‌ర్న్` తో మంచి విజ‌యాన్ని అందించారు. తాజాగా అదే న‌మ్మ‌కంతో అనుష్క కూడా ఛాన్స్ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే అనుష్క క‌థ‌నార్ అనే సినిమాతో మాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సౌత్ లో ఇప్ప‌టికే తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టించిన అనుష్క ఎంట‌ర్ అవ్వాల్సింది క‌న్న‌డ‌లోనే. అక్క‌డా స‌రైన క‌థ కుదిరితే జెండా ఊపేస్తుంది.

Tags:    

Similar News