గుస్తాఖ్ ఇష్క్: రిలీజ్ డేట్ లాక్

ప్రముఖ బ్యూటీ మిల్కీ బ్యూటీ తమన్న విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోందని వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.;

Update: 2025-11-16 00:30 GMT

ప్రముఖ బ్యూటీ మిల్కీ బ్యూటీ తమన్న విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోందని వార్తలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు వారే స్వయంగా ప్రకటించారు కూడా.. కొద్దిరోజులు పార్టీలకు, వెకేషన్ లకు కలిసి వెళ్లిన ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. అయితే విడిపోవడానికి గల కారణమేంటో తెలియదు కానీ అప్పుడప్పుడు తమన్నా తనను మోసం చేశారని, తనకు అబద్ధాలు చెప్పేవారంటే నచ్చదు అని చెప్పి ఆశ్చర్యపరిచింది. దీనిని బట్టి చూస్తే విజయ్ వర్మ ఆమెతో అబద్ధాలు చెప్పారేమో.. అందుకే అతడిని దూరం పెట్టింది అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి.




ఇక వీరి మధ్య బ్రేకప్ అయ్యిందో లేదో అప్పుడే దంగల్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఫాతిమా సనా షేక్ తో విజయ్ వర్మ ఎక్కువగా కనిపించారు. పైగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ ఈ జంట ఈ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మరోసారి తాజాగా ఫాతిమా సనా షేక్ విజయ్ వర్మతో చాలా చనువుగా ఉన్నట్టు కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. దీనితో ఈ రూమర్స్ కాస్త బలమవుతున్న నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ ఫోటోలు షేర్ చేసినట్లు క్యాప్షన్ జోడించి అందరిని ఆశ్చర్యపరిచింది ఫాతిమా.




అసలు విషయంలోకి వెళ్తే.. విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటిస్తున్న తాజా చిత్రం గుస్తాఖ్ ఇష్క్. బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా పేరు దక్కించుకున్న మనీష్ మల్హోత్రా నిర్మాతగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి విభూ పూరీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి 2:30 నిమిషాల ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా.. టైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. నవంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ఫాతిమా షేక్ విజయ్ వర్మతో చాలా చనువుగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే ఇన్ని రోజులు వీరిద్దరూ సినిమా కోసమే ఇలా చనువుగా తిరిగారనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఫాతిమా షేర్ చేసిన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే ట్రైలర్ లో చూసిన స్టోరీని బట్టి చూస్తే.. విజయ్ వర్మ ఉర్దూ కవిత్వం నేర్చుకోవడానికి నజీరుద్దీన్ షా ఇంటికి వెళ్లడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది కవితలు నేర్చుకోవడం మాటేమో కానీ నజీరుద్దీన్ షా కుమార్తె ఫాతిమాతో విజయ్ ప్రేమలో పడతాడు. అలా ఈ జంట అద్భుతమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.



Tags:    

Similar News