• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గామి కోసం రంగంలోకి...

గామి కోసం రంగంలోకి విశ్వక్.. మీరు రెడీనా?

| పీసీఎక్స్ ఫార్మాట్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు నిన్ననే తెలిపారు మేకర్స్

By - Tupaki Desk
Update: 2024-02-27 07:28 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రతీ మూవీలో కొత్తదనం చూపిస్తున్నారు. మాస్ కా దాస్ గా అలరిస్తున్న విశ్వక్.. ఇప్పుడు సరికొత్త జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అడ్వెంచరెస్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిన గామి మరో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మానవ స్పర్శను తట్టుకోలేని అఘోర శంకర్ గా విశ్వక్ సేన్ అలరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటి వరకు విశ్వక్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా గామి ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివరాత్రి కానుకగా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ ను ఫిబ్రవరి 29వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

పీసీఎక్స్ ఫార్మాట్ లో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు నిన్ననే తెలిపారు మేకర్స్. తాజాగా విశ్వక్ కూడా వీడియో మెసేజ్ ఇచ్చారు. "హాయ్.. 29వ తేదీ ఫిబ్రవరి లీప్ ఇయర్ రోజు ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో పీసీఎక్స్ ఫార్మాట్ లో నాలుగు గంటలకు గామి ట్రైలర్ లాంఛ్. ట్రైలర్ అక్కడ చూస్తే మాత్రం చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాలుగున్నరేళ్లుగా ఈ చిత్రం కోసం కష్టపడుతున్నాం. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ను మిస్ అవ్వొద్దు. ఫిబ్రవరి 29వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో లాంచ్. నేను కూడా వస్తున్నా" అంటూ విశ్వక్ మాట్లాడుతున్న వీడియోను మేకర్స్ షేర్ చేశారు.

అయితే హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ అంటే చాలా మంది ప్రేక్షకులకు ఫేవరెట్ థియేటర్ అని చెప్పాలి. అందులో పీసీఎక్స్ స్క్రీన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి సూపర్ స్క్రీన్ పై గామి ట్రైలర్ రిలీజ్ అంటే వేరే లెవల్. కచ్చితంగా సినిమాలోని అన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు క్లియర్ గా తెలుస్తాయి. నాలుగున్నరేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.

మార్చి 8వ తేదీన రిలీజ్ కానున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఆమె క్యారెక్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి గామి మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Experience #GaamiShowreelTrailer in the 𝗣𝗖𝗫 𝐅𝐎𝐑𝐌𝐀𝐓 on 29th Feb at Prasads Multiplex from 4PM onwards 🏔️🤩

Join the team to witness the scale and grandeur of #Gaami ✨

Grab your passes now!
- https://t.co/pqvUEplMD9

Grand release worldwide on March 8th 🧿… pic.twitter.com/oIaWTlYLC5

— UV Creations (@UV_Creations) February 27, 2024
Tags:    
  • Gaamishowreeltrailer 
  • PCXformat 
  • Gaamimovie 
  • Vishwaksen 
  • Prasadimax 
  • Tollywood 
  • Gaamitrailer 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS