OTTల కొత్త ప్లాన్.. వెయిటింగ్ ను క్యాష్ చేసుకుంటూ!
కానీ ఇప్పుడు హిట్ స్టేటస్ అందుకున్న చిత్రాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి.;
ఒకప్పుడు సినిమాలు చూడాలంటే.. థియేటర్స్ లో లేకుంటే.. కొన్ని నెలలు అయ్యాక టీవీలో.. కానీ ఓటీటీల పుణ్యమా అని పరిస్థితులు మారిపోయాయి. అది కూడా కోవిడ్ టైమ్ లోనే. నిజానికి ఓటీటీలన్నీ అప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. అన్ని భాషల కంటెంట్ అందుబాటులో ఉండడంతో మూవీ లవర్స్ అట్రాక్ట్ అయిపోయారు.
అంతే కాదు.. అప్పటి నుంచి ఎక్కువగా ఓటీటీలవైపే మొగ్గు చూపుతున్నారు. అభిమానులతోపాటు కొందరు సినీ ప్రియులు.. థియేటర్స్ లో సినిమాలు చూస్తుండగా.. వారు మాత్రం ఓటీటీలపైనే ఆధారపడుతున్నారు. ఎంత పెద్ద హిట్ మూవీ అయినా థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూసేందుకు వారంతా పెద్దగా మొగ్గు మాత్రం చూపడంలేదు.
ఇంకా చిన్న, మీడియం సినిమాలకు అయితే పూర్తిగా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అన్ని సినిమాలనూ ఓటీటీలోనే చూద్దామనుకుంటున్నారు. అలా కొత్త సినిమాల కోసం ఓటీటీ లవర్స్ ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దాన్నే ఓటీటీ నిర్వాహకులు ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. తమదైన ప్లాన్ తో ముందుకెళ్తున్నారు.
కొన్ని రోజుల వరకు సినిమా రిజల్ట్ బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ డిపెండ్ అయ్యేది. మిక్స్ డ్ లేదా డిజాస్టర్ రిజల్ట్ అందుకున్న చిత్రాలు.. కాస్త ముందుగానే.. అంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలలోపే స్ట్రీమింగ్ అయ్యేవి. బాక్సాఫీస్ తో పాటు ఆడియన్స్ ను సూపర్ రెస్పాన్స్ అందుకున్న చిత్రాల స్ట్రీమింగ్ కు కాస్త టైమ్ పట్టేది.
కానీ ఇప్పుడు హిట్ స్టేటస్ అందుకున్న చిత్రాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఎంతటి వసూళ్లు వచ్చినా.. వస్తున్నా కూడా నాలుగు వారాల లోపే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే హిట్ మూవీస్ కోసం ఓటీటీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు. కాబట్టి వేగంగా స్ట్రీమింగ్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయనే ప్లాన్ లో ఓటీటీలు ఉన్నాయి.
ఇటీవల లిటిల్ హార్ట్స్, మిరాయ్, ఓజీ సినిమాల విషయాల్లో తమ ప్లాన్ తో ఆయా ఓటీటీలు సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే.. తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో లిటిల్ హార్ట్స్ రికార్డు క్రియేట్ చేసింది. మిరాయ్ ఏకంగా వరల్డ్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఓజీ మూవీ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు కాంతార చాప్టర్ 1 మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. మొత్తానికి రిలీజ్ కు ముందు చేసుకున్న డీల్స్ ప్రకారం.. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమాలను విడుదలైన నాలుగు వారాల్లోపు స్ట్రీమింగ్ చేస్తూ ఓటీటీలు లాభపడుతున్నాయి. కానీ ఇదే కంటిన్యూ అయితే థియేటర్స్ ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది.