సౌత్‌ను ఊపేస్తున్న ఐదుగురు యంగ్ హీరోయిన్లు !
ప్రస్తుతం సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. దీంతో నవతరం నటీమణులు కూడా సరిహద్దులతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తున్నారు.
ప్రస్తుతం సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. దీంతో నవతరం నటీమణులు కూడా సరిహద్దులతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక భాషకే పరిమితమయ్యే కథానాయికలు నేడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లలో వరుస క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటూ టాప్ లీగ్‌లోకి దూసుకుపోతున్నారు. గ్లామర్‌తో పాటు అద్భుతమైన అభినయదక్షిణాది చిత్రపరిశ్రమలో కొత్త గాలి వీస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ యంగ్ హీరోయిన్లు వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
ప్రస్తుతం సౌత్ ఇండియాని ఊపేస్తున్న ఐదుగురు యంగ్ హీరోయిన్లు నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా బహుభాషా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న భామల్లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. ఈ యంగ్ బ్యూటీ మలయాళంలో ఆపరేషన్ గంగ వంటి ఆసక్తికర చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళంలో స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన అవకాశాన్ని దక్కించుకుంది. వరుసగా పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉండటంతో అమ్మడు సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవలే తెలుగులో `లెనిన్` తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
మరొ నటి రుక్మిణి వసంత్ ప్రతిభతో స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన `డ్రాగన్` లో నటిస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన `ధర్మన్` చిత్రంలో నటిస్తోంది. మలయాళంలో నివిన్ పౌలీ వంటి నటుడితో కలసి పనిచేస్తూ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటోంది. అలాగే కయాదు లోహర్ కూడా వరుస లైనప్‌తో టాలీవుడ్, కోలీవుడ్‌లలో హల్‌చల్ చేస్తోంది. నేచురల్ స్టార్ నాని సరసన `పారడైస్` చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు కోలీవుడ్‌లో సూర్య 48వ చిత్రంలో.. మలయాళంలో `తారం` అనే సినిమాలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.
మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చి సౌత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న నటి మమితా బైజు. సహజసిద్ధమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అమ్మడు తమిళం, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో తీరిక లేని షెడ్యూల్స్‌తో బిజీగా గడుపుతోంది.
మరోవైపు ప్రీతి ముకుందన్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ స్థాయికి విస్తరిస్తోంది. తెలుగులోనూ అడపా దడపా అవకాశాలు అందుకుంటుంది. అమ్మడు కథల విషయంలో చాలా సెలక్టివ్ గా ఉంటుంది.తమిళంలో `దశమకం` అనే చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో `నాగ్జిల్లా` అనే ప్రాజెక్ట్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇలా ఐదుగురు భామలు రాబోయే రోజుల్లో సౌత్ సినిమాను మరింత ఏలడం ఖాయం.