బ్లాక్ వెల్వెట్ చీరలో ఫాతిమ నాజూకు సొగసు
`దంగల్` ఫేం ఫాతిమా సనా షేక్ చురుకైన హావభావాలు, ఫ్యాషన్ సెన్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు.;
`దంగల్` ఫేం ఫాతిమా సనా షేక్ చురుకైన హావభావాలు, ఫ్యాషన్ సెన్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు. ఇటీవల ఈ బ్యూటీ బొద్దుతనం నుంచి మారిపోయి, సన్నజాజి తీగలా మెరిసిపోతోంది. మొన్నటికి మొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చెప్పిన కొన్ని వ్యక్తిగత అనారోగ్య సమస్యలు నిజంగా అభిమానులకు షాకిచ్చాయి. తనకు అదుపు తప్పి తినే అలవాటు ఉందని, దానివల్ల చాలా బరువు పెరిగానని, తిండిని కట్టేసే శక్తి తనకు లేదని ఫాతిమా చెప్పింది. తినడానికి ఏదైనా ఉంటే, గంటల తరబడి తినగలనని అది చూసి సహచరులు ఝడుసుకుంటారని కూడా చెప్పింది.
బాగా తినే అలవాటు చాలా పెద్ద సమస్య. సెట్ లో అందరూ చూస్తుంటే సిగ్గుగా ఉండేదని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు దానిని అధిగమించానని తెలిపింది. ఫాతిమా ఆహార నియమాలను మార్చుకుంది.. చికిత్సను తీసుకుంది. ఫిట్ లుక్ కోసం జిమ్ లో చాలా శ్రమిస్తోంది. ఇటీవల టోన్డ్ లుక్ ను సాధించింది.. రూపం చాలా మారింది. అందాల ఫాతిమ ఇప్పుడు సన్నజాజి తీగను తలపిస్తోంది. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న `గుస్తాక్ ఇష్క్` సినిమా ప్రమోషన్లలో ఫాతిమా నల్ల రంగు వెల్వెట్ చీర ధరించి గుబులు రేపిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇది వింటర్ ఎడిషన్.. బ్లాక్ వెల్వెట్ చీరకు తగ్గట్టుగా, కిల్లర్ కటౌట్ బ్లౌజ్, బోల్డ్ ఎమరాల్డ్ లాకెట్టు ధరించిన ఫాతిమా చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. రెడ్ కార్పెట్ పై ఈ బ్యూటీ కిల్లింగ్ గా కనిపించింది. ప్రస్తుతం ఫాతిమా ఐకానిక్ ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్‌గా మారుతున్నాయి.
ఎత్తైన నెక్‌లైన్, పాలిష్ చేసిన ఫ్రంట్ కటౌట్, చిన్న స్ట్రక్చర్డ్ స్లీవ్‌లు, సైడ్ కట్ స్టైలింగ్ పీస్ తో బ్లౌజ్ కూడా ఈ చీరకు అంతే మ్యాచ్ అయింది. ఫాతిమా లుక్ కేవలం స్టైలింగ్ వల్లనే కాదు.. తన హొయలుతోను మరో స్థాయి ఎలివేషన్ కి చేరుకుంది. ఫోటోషూట్ కోసం అందమైన భంగిమలతోను దంగల్ బ్యూటీ గుబులు రేపింది. మనీష్ మల్హోత్రా ఈ డిజైనర్ చీర - అందమైన బ్లౌజ్‌ను డిజైన్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఫాతిమ నటించిన తాజా చిత్రం `గుస్తాక్ ఇష్క్` ట్రైలర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ వర్మ కథానాయకుడిగా నటించగా, నసీరుద్దీన్ షా ఫాతిమా తండ్రిగా నటించారు. ఇది ఒక అందమైన రొమాంటిక్ లవ్ స్టోరి. సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన యువకుడు గురువు కుమార్తెను ప్రేమించాక ఏం జరిగిందనేదే ఈ సినిమా. ఇందులో ఫాతిమా నటనకు ఆస్కారం ఉన్న పాత్రను పోషించింది. ఈనెల 28న సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఈరోజు ముంబైలో సెలబ్రిటీ ప్రీమియర్ ని చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ హీమ్యాన్ ధర్మేంద్ర మృతి అనంతరం సంస్మరణం గౌరవార్థకంగా ప్రీమియర్ ని చిత్రబృందం వాయిదా వేసుకుంది.