ఈస్పీడ్ లో డ్యాషింగ్ డైరెక్టర్ నే మించేలా ఉన్నాడే?
ఇక అనీల్ మేకింగ్ శైలి కూడా పూరి తరహాలోనే వేగంగా ఉంటుంది. సినిమాని చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయడం అనీల్ ప్రత్యేకత.;
ఇండస్ట్రీలో అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేయగల దర్శకుడు ఎవరు? అంటే ఒన్ అండ్ ఓన్లీ పూరి జగన్నాధ్ పేరే అంతా చెబుతారు. పూరి జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తాడు. మహా అయితే ఆయన సినిమా షూటింగ్ రెండు నెలలు. ఇంకా అంతకు మించి మూడు నెలలు. లీస్ట్ గా చూసుకుంటే నెల రోజుల్లో చుట్టేస్తాడు. షూటింగ్ పూర్తి చేయడం అన్నది కేవలం దర్శకుడి చేతిల్లో పని మాత్రమే. అక్కడ అతడు చెప్పిందే వేదం.
అందుకే పూరి సినిమాలకు నిర్మాణ వ్యయం తక్కువవుతుంది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ అన్నది సినిమా పై ఆధారపడి ఉంటుంది. పూరి మేకింగ్ స్పీడ్ చూసి దర్శకధీరుడు రాజమౌళినే ఫిదా అయ్యారు. సినిమా ఎలా తీయాలో పూరి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి నేర్చుకోవాలని రాజమౌళినే దిగొచ్చి అన్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు గానీ, దాని ఖర్చుగానీ, ప్రచారం ఖర్చు..రిలీజ్ ఇలా ప్రతీ దాని లో పూరి మార్క్ కనిపిస్తుంది.
ఎక్కడికక్కడ ఆయన ఖర్చు తగ్గించి సింపుల్ గా తేల్చేస్తాడు. దటీజ్ పూరి. మరి పూరి పేరిట ఉన్న ఈ రికార్డును యంగ్ డైరెక్టర్ అనీల్ రావపూడి బ్రేక్ చేసే అవకాశం ఉందా? అందుకు ఛాన్సెస్ కనిపిస్తు న్నాయి. పదేళ్ల కెరీర్ లో ఎనిమిది సినిమాలు తీసాడు అనీల్. వీటిలో ఒక్కటి కూడా ప్లాప్ కాలేదు. అంటే ఆయన ఖాళీగా ఉంది రెండేళ్లు మాత్రమే. మిగతా సమయమంతా ఎంతో ఫోకస్ట్ గా పనిచేసాడు కాబట్టే సాధ్యమైంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విక్టరీ వెంకటేష్ ని ఏకంగా 300 కోట్ల క్లబ్ లో కూర్చోబెట్టాడు.
ఇక అనీల్ మేకింగ్ శైలి కూడా పూరి తరహాలోనే వేగంగా ఉంటుంది. సినిమాని చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయడం అనీల్ ప్రత్యేకత. ఇటీవలే మెగాస్టార్ 157వ చిత్రం పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. తాజాగా ముస్సోరీ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ చిత్రాన్ని సంక్రాం తి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించారు. ఆ తేదీకి కట్టుబడే షూటింగ్ వేగంగా పూర్తి చేస్తున్నారు. అనీల్ స్పీడ్...స్పార్క్ ఇంకా మెరుగవుతుంది. అప్పుడు పూరినే మించిపోతాడు.