తెలుగ‌మ్మాయి టాలెంట్ ను గుర్తించిన తెలంగాణ ప్ర‌భుత్వం

ఆరడుగుల అంద‌గ‌త్తె ఫ‌రియా అబ్దుల్లా టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, న‌ట‌న‌తో పాటూ అమ్మ‌డికి అన్ని విష‌యాల్లోనూ టాలెంట్ ఉంది.;

Update: 2025-05-30 10:03 GMT

ఆరడుగుల అంద‌గ‌త్తె ఫ‌రియా అబ్దుల్లా టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, న‌ట‌న‌తో పాటూ అమ్మ‌డికి అన్ని విష‌యాల్లోనూ టాలెంట్ ఉంది. తాజాగా గ‌ద్ద‌ర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఫ‌రియా స్పెష‌ల్ జ్యూరీలో అవార్డు ద‌క్కించుకుంది. ఈ విష‌యాన్ని జ్యూరీ వెల్ల‌డించ‌గానే ఫ‌రియా ఎంతో ఎమోష‌న‌ల్ అవుతూ సోష‌ల్ మీడియాలో త‌న ఆనందాన్ని పంచుకుంది.


తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర అవార్డుల విజేత‌ల‌ను అనౌన్స్ చేసింది. ప్ర‌ముఖ విప్ల‌వ గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ్ఞాప‌కార్థంగా తెలంగాణ ప్ర‌భుత్వం అత‌ని పేరుని ఈ అవార్డుల‌కు పెట్టింది. సినీ ఇండ‌స్ట్రీలోని కొత్త టాలెంట్ ను గౌర‌వించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ అవార్డుల వేడుక జూన్ 14న హైద‌రాబాద్ లో ఎంతో ఘ‌నంగా సెల‌బ్రిటీల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

అయితే అవార్డు విజేత‌ల్లో మ‌త్తు వ‌ద‌ల‌రా2 లో ఫరియా పాడిన న‌క్కో మామా అనే ర్యాప్ సాంగ్ కు అవార్డు ద‌క్కింది. మ‌త్తు వ‌ద‌ల‌రా2 స‌ర్‌ప్రైజింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌గా, ఆమె పాడిన ఈ ర్యాప్ సాంగ్ ఓ స్పెష‌ల్ సాంగ్ గా మారింది. ఈ విష‌యంలో ఫ‌రియా త‌న సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఈ అవార్డు వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ అవార్డు ఇచ్చినందుకు గ‌ద్ద‌ర్ అవార్డుల జ్యూరీకి ధ‌న్య‌వాదాల‌ని, దీనికి కార‌ణ‌మైన మ‌త్తువ‌ద‌ల‌రా2 టీమ్ కు డైరెక్ట‌ర్ రితేష్ రాణాకు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వకు థ్యాంక్స్ చెప్పింది.

ఈ అవార్డు వ‌చ్చాక అంద‌రి దృష్టి ఫ‌రియాపై ఉన్న‌ప్ప‌టికీ ఆమె మాత్రం చాలా విన‌మ్రంగా ఉంటూనే కేవ‌లం సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా త‌న ఆనందాన్ని షేర్ చేసుకుంది. ఈ నోట్ లో త‌నతో పాటూ అవార్డులు వ‌చ్చిన మిగిలిన విజేత‌ల‌కు కూడా ఆమె కంగ్రాట్యులేష‌న్స్ చెప్ప‌గా, ఇలాంటి అవార్డులు ఆర్టిస్టుల నుంచి ఇంకా బెస్ట్ వ‌ర్క్ ను బ‌య‌ట‌కు తీసుకొస్తాయ‌ని చెప్పింది.

Tags:    

Similar News