'ఈషా' సెన్సేషన్.. బన్నీ వాసు వంశీ నందిపాటి హ్యాట్రిక్

చిన్న సినిమాగా మొదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ గా మారింది 'ఈషా'. ఆడియెన్స్ ని భయపెడుతూనే వాళ్ళ మనసుల్ని గెలుచుకుంటోంది ఈ చిత్రం.;

Update: 2025-12-28 11:02 GMT

చిన్న సినిమాగా మొదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ గా మారింది 'ఈషా'. ఆడియెన్స్ ని భయపెడుతూనే వాళ్ళ మనసుల్ని గెలుచుకుంటోంది ఈ చిత్రం. థ్రిల్స్, ట్విస్టులతో నిండిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించడానికి ప్రధాన కారణం మేకర్స్ చేసిన ప్రమోషన్స్ అనే చెప్పాలి. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు.

కంటెంట్ బలంగా ఉంటే సినిమా చిన్నదా పెద్దదా అని చూడరని ఈ నిర్మాతలు మరోసారి నిరూపించారు. ఇప్పటికే 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఈ కాంబినేషన్ కి ఇది హ్యాట్రిక్ విజయం. బుకింగ్స్ ప్లాట్ ఫామ్స్ లో టికెట్లు జోరుగా తెగుతున్నాయి. చిన్న సినిమా కాస్తా మెల్లగా బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్తోంది.

పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సినిమాకి పాజిటివ్ వైబ్ మొదలైంది. ప్రీమియర్స్ అన్ని చోట్లా హౌస్ ఫుల్ అయ్యాయి. మొదటి రోజే దాదాపు 2.18 కోట్ల గ్రాస్ రాబట్టడమే కాకుండా, 60 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయంటే ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ జోరు రెండు, మూడు రోజుల్లో కూడా అదే రేంజ్ లో కొనసాగింది.

కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 4.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేసి, అప్పుడే లాభాల బాట పట్టింది. ప్రస్తుతం అన్ని ఏరియాల్లోనూ మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతూ, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. సినిమా కమర్షియల్ గా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.

ముఖ్యంగా హారర్ జానర్ ని ఇష్టపడే వారికి ఇందులో ఉన్న జంప్ స్కేర్స్, ఊహించని ట్విస్టులు బాగా నచ్చుతున్నాయి. ఆడియెన్స్ నుంచి వస్తున్న ప్రేమ చూస్తుంటే ఈ క్రిస్మస్ విన్నర్ గా 'ఈషా' నిలిచిందని అర్థమవుతోంది. మంచి కంటెంట్ వస్తే ఆదరించడానికి జనం ఎప్పుడూ రెడీగా ఉంటారని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.

త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. థియేటర్లో ఆడియెన్స్ కి ఒక మంచి హారర్ ఎక్స్ పీరియెన్స్ ని ఈ సినిమా ఇస్తోంది. మొత్తానికి బన్నీ వాసు, వంశీ నందిపాటి తమ జడ్జిమెంట్ తప్పు కాదని ఈ హ్యాట్రిక్ విజయంతో ఇండస్ట్రీకి చాటి చెప్పారు.

Tags:    

Similar News