• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డబుల్ ఇస్మార్ట్.. బడా...

డబుల్ ఇస్మార్ట్.. బడా స్టార్ పై పూరి ఫోకస్

| హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన క్యాస్టింగ్ సినిమాలో కీలకంగా ఉండాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారంట

By - Tupaki Desk
Update: 2023-07-28 04:47 GMT

రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల రామ్ కి జోడిగా నటిస్తోంది. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీని తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ మూవీ చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ చిత్రం ఉండబోతుంది.

పాన్ ఇండియా లెవెల్ లోనే ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో చార్మి నిర్మిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి.

ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. మూవీలో బాలీవుడ్ మున్నా భాయ్ సంజయ్ దత్ ని తీసుకునే ప్లాన్ లో పూరి జగన్నాథ్ ఉన్నారంట. ఓ కీలక పాత్ర కోసం అతన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాలంటే కచ్చితంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన క్యాస్టింగ్ సినిమాలో కీలకంగా ఉండాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారంట.

అందుకే హీరోయిన్ తో పాటు మరి కొన్ని పాత్రల కోసం అక్కడి నటులను ఎంపిక చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా స్థాయిలో చేసిన లైగర్ మూవీ డిజాస్టర్ కావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాని చేయబోతున్నారు.

రామ్ పోతినేని కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరల సాలిడ్ సక్సెస్ ఇప్పటి వరకు లభించలేదు. కమర్షియల్ మాస్ హీరోగా తనని తాను ప్రెజెంట్ చేసుకోవాలని రామ్ భావిస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు బోయపాటితో స్కంద మూవీ చేస్తున్నాడు. అలాగే పూరితో డబుల్ ఇస్మార్ట్ కూడా రెడీ అవుతోంది. మరి వీరిద్దరూ ఈ సీక్వెల్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నారనేది చూడాలి.

Tags:    
  • Rampothineni 
  • Purijagannadh 
  • Doubleismart 
  • Bollywood 
  • Cast 
  • Panindian 
  • Shradhakapoor 
  • Sanjaydutt 
  • Liger 

Similar News

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS