ఎమ్మెల్యే బయోపిక్.. ఛాన్స్ అందుకున్న స్టార్ యాక్టర్..!

నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యే గా ఉన్నా సరే చాలా సాదాసీదా జీవనాన్ని గడిపారు

Update: 2023-12-11 07:30 GMT

కోలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ సముద్రఖని టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. స్క్రీన్ మీద నటుడిగా తెర వెనుక దర్శకుడిగా రెండు పాత్రల్లో సముద్రఖని తన సత్తా చాటుతున్నారు. తమిళంలో దర్శకుడిగా తన ముద్ర వేసిన ఆయన తెలుగులో మాత్రం నటుడిగా మెప్పిస్తూ వస్తున్నారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే సముద్రఖని అవలీలగా చేస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య కాలంలో విలన్ గా చాలా ప్రాజెక్ట్ లు చేశారు సముద్రఖని.

రీసెంట్ గా వచ్చిన విమానం సినిమాతో ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసిన సముద్రఖని ప్రస్తుతం కమెడియన్ ధన్ రాజ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని టాక్. ఇక ఈ సినిమాతో పాటుగా సముద్రఖని రాజకీయ నాయకుడి జీవిత కథలో నటిస్తున్నారని తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో లీడ్ రోల్ చేస్తున్నారు సముద్రఖని.

నిజాయితీకి మారుపేరుగా నిలిచిన గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యే గా ఉన్నా సరే చాలా సాదాసీదా జీవనాన్ని గడిపారు. ఆయన జీవిత కథతో సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా సముద్రఖని ఆల్రెడీ షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఓ పక్క స్టార్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మరోపక్క నటుడిగా గుర్తింపు తెచ్చే పాత్రలతో కూడా మెప్పిస్తున్నారు సముద్రఖని. డైరెక్టర్ గా కోలీవుడ్ లో కన్నా నటుడిగా టాలీవుడ్ లో అతని కెరీర్ సూపర్ గా నడుస్తుంది. చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా డైరెక్ట్ చేసిన సముద్రఖని దర్శకుడిగా కూడా తన మార్క్ చాటాలని చూస్తున్నారు.

Read more!

ప్రస్తుతం నటుడిగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు సముద్రఖని. మళ్లీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి తను చెప్పాలనుకున్న కథను చెప్పే ప్రయత్నం చేస్తారు. నటుడు, దర్శకుడు ఈ రెండు పాత్రలతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు సముద్రఖని. తెలుగు సినిమాల్లో ఈమధ్య కాలంలో ఆయనంత బిజీ ఆర్టిస్ట్ ఎవరు లేరని చెప్పొచ్చు. ఈ హవా ఎన్నాళ్లు కొనసాగుతుందో కానీ అప్పటి వరకు సముద్రఖని రకరకాల పాత్రలతో మెప్పించాలని చూస్తున్నారు.

Tags:    

Similar News