ఆడియన్స్‌ని ఇన్నాళ్లూ మోసం చేస్తున్నారా?
`రాబిన్ హుడ్` తరువాత నితిన్ చేస్తున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా `తమ్ముడు`. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.;

`రాబిన్ హుడ్` తరువాత నితిన్ చేస్తున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా `తమ్ముడు`. సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది. వర్ష బొల్లమ్మ, స్వాసిక విజయ్, సౌరభ్ సచ్‌దేవ్, చమ్మక్ చంద్ర ఇర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించారు. గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదాపడుతూ వస్తున్న ఈ మూవీని ఎట్టకేలకు జూలై 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ సినీ అభిమానుల్లోనూ సరికొత్త చర్చకు తెరలేపాయి. `యూట్యూబ్‌లో అన్నీ ఒరిజినల్ నంబర్సే ఉండాలి. డబ్బులు పెట్టి వ్యూస్ కొనకండని నా పీఆర్ టీమ్‌కు చెప్పాను. ట్రైలర్, సాంగ్ యూట్యూబ్‌లో ఎంత రీచ్ అవుతుందో తెలిస్తే.. మన సినిమా రీచ్ ఏంటో అర్థమవుతుంది. ఈ మూవీతోనే ఆ అడుగు వేశాను. విషయముంటే వందశాతం ప్రేక్షకులు చూస్తారు` అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే ఇంత కాలం ఫేక్ వ్యూస్‌తో ప్రేక్షకుల్ని మేసం చేశారా? అని అంతా ఫైర్ అవుతున్నారు. `యూట్యూబ్‌లో అన్నీ ఒరిజినల్ నంబర్సే ఉండాలి. డబ్బులు పెట్టి వ్యూస్ కొనకండని నా పీఆర్ టీమ్‌కు చెప్పాను.` అంటే ఇంత కాలం యూట్యూబ్‌లో టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి వ్యూస్ కొనండని పీఆర్ టీమ్‌కు చెప్పారనేగా అర్థం. కంటెంట్ హీరో, నా సినిమాల్లో కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. నేను కంటెంట్‌ని నమ్మి మాత్రమే సినిమాలు చేస్తానని స్టేట్‌మెంట్‌లిచ్చిన దిల్ రాజు వ్యూస్ కోసం డబ్బులు ఖర్చు చేశారంటే ఆడియన్స్‌ని మోసం చేశారనేగా అర్థం.
దిల్ రాజు ఓపెన్ అయ్యాడు కాబట్టి అసలు విషయం బయటికొచ్చింది. బిగతా వాళ్లు పరిస్థితి కూడా ఇంతే కదా? దఇల్ రాజు మాటలతో వ్యూస్ విషయంలో ఆడియన్స్‌ని కొన్నేళ్లుగా మోసం చేశారని తేలింది. కలెక్షన్స్ విషయంలోనూ ఇలాగే హీరోల అభిమానుల్ని మోసం చేస్తూ వస్తున్నారన్నట్టేగా?..ఇన్నాళ్ళూ ఆడియన్స్‌ని మోసం చేస్తూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు తమ ఒరిజినాలిటీని చూపించే సమయం వచ్చేసింది. ఎవరు ఒరిజినలో ఎవరు ఫేకో తేలిపోయే సమయం వచ్చిందని సినీ లవర్స్ మండిపడుతున్నారు.