బిగ్ బాస్ 9.. కమెడియన్ కాదు హీరో..!

బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5లో ఉన్న వారిలో ఆల్ రౌండర్ గా ఇమ్మాన్యుయెల్ తన సత్తా చాటుతున్నాడు.;

Update: 2025-12-18 12:56 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5లో ఉన్న వారిలో ఆల్ రౌండర్ గా ఇమ్మాన్యుయెల్ తన సత్తా చాటుతున్నాడు. సీజన్ 9లో టాస్కుల్లోనే కాదు ఎంటర్టైన్మెంట్ లో కూడా ఇమ్మాన్యుయెల్ బెస్ట్ ఇస్తూ వచ్చాడు. ఐతే ప్రతి సీజన్ లో లానే చివరి వారంలో కంటెస్టెంట్స్ ఏవి లు వేస్తారు. వారి 100 రోజుల జర్నీతో పాటుగా టాప్ 5 వచ్చిన ప్రతి కంటెస్టెంట్ గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడతాడు. బుధవారం ఎపిసోడ్ లో ఫస్ట్ ఇమ్మాన్యుయెల్ జర్నీని చూపించాడు బిగ్ బాస్.

100 రోజుల తమ ఆటని అలా ఒకసారి..

హౌస్ లోకి కమెడియన్ గా వచ్చి హీరోగా వెళ్తున్నావ్ అని అమ్మకి ఇచ్చిన మాట నెరవేర్చావని అన్నాడు బిగ్ బాస్. అంతేకాదు తన జర్నీకి సంబంధించిన వీడియో చూపించేసరికి ఇమ్మాన్యుయెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. 100 రోజుల తమ ఆటని అలా ఒకసారి చూస్తే ఇన్నిరోజులు వారు పడిన కష్టం ఆడిన ఆట అలా కళ్ల ముందుకు వస్తుంది. అంతేకాదు వారి ఆట గురించి బిగ్ బాస్ మాట్లాడటం మరింత సర్ ప్రైజ్ చేస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ఒక కమెడియన్ మాత్రమే కాదు అతనొక ఆట గాడుగా సత్తా చాటాడు. ఈ సీజన్ లో ఎక్కువ టాస్కులు ఆడి గెలిచింది కూడా అతనే. ఇక సీజన్ 9లో స్టార్ కంటెస్టెంట్ గా అతని మీద పెట్టుకున్న అంచనాలకు తగినట్టుగా ఆడాడు ఇమ్మాన్యుయెల్. ఐతే మొన్నటిదాకా టైటిల్ రేసులో ఉన్నాడని అనిపించినా అతని పైన మరో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం వల్ల ఇమ్మాన్యుయెల్ కి ఆ ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

సీజన్ 9లో స్టార్ ప్లేయర్ గా..

ఇమ్మాన్యుయెల్ మాత్రం బిగ్ బాస్ సీజన్ 9లో స్టార్ ప్లేయర్ గా తన ఆటతో ఆడియన్స్ ని మెప్పించాడు. హౌస్ లో ఈ వారం టాప్ 5 గా ఉన్న తనూజ, కళ్యాణ్, డీమాన్ పవన్, సంజనలతో ఇమ్మాన్యుయెల్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ ని గెలిపించాలని అతను ఒక కమెడియన్ మాత్రమే కాదు హీరోనే అని ప్రూవ్ చేయాలని అతని ఫాలోవర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇమ్మాన్యుయెల్ టైటిల్ గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉంది.. సీజన్ 9 విన్నర్ ఎవరన్నది ఈ ఆదివారం సాయంత్రం తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ మొదటి నుంచి తన కాన్ స్టంట్ ఎఫర్ట్ తో అదరగొడుతూ వస్తున్నాడు. ఐతే సీజన్ లో ఎక్కువగా నామినేషన్స్ లోకి రాని కారణంగా అతను థర్డ్ ప్లేస్ లో ఉన్నాడని కొందరు చెబుతున్నారు. ఐతే మరో రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఏదైనా జరగొచ్చు అని ఆడియన్స్ అంటున్నారు.

Tags:    

Similar News