పార్ట్ -2 బ్యాచ్ నేర్చుకోవాల్సిందిదే!
అంటే మొదటి భాగంతో పాటే కంటున్యూటీ కథను చేస్తూ వచ్చారు. మార్చిలో రిలీజ్ అంటే? షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకూ పూర్తయ్యాయి కాబట్టే ప్రకటించగలిగారు.;
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత తెలుగు సినిమా స్వరూపం మారింది. ఒకే కథని రెండు భాగాల్లో చెప్పడం.. లేదంటే సెట్స్ కు వెళ్లిన తర్వాత నిడివి కారణంగా అప్పటికప్పుడు రెండు పార్టులుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ విషయంలో మేకర్స్ కూడా క్లారిటీగా ఉండటం లేదన్నది వాస్తవం. `బాహుబలి` చిత్రాన్ని ఒకే భాగంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెట్స్ కు వెళ్లిన తర్వాత అది రెండు భాగాలు అయింది. `బాహుబలి` ప్రాంచైజీ ఒక్కో భాగం మూడు గంటలకు పైగానే ఉంటుంది. ఆ తర్వాత `పుష్ప` విషయంలో సెట్స్ కు వెళ్లిన తర్వాత అక్కడిక్కడ రెండు భాగాలు గా విడిపోయింది.
సెట్స్ కు వెళ్లిన తర్వాత మారిన పరిస్థితులు:
ఈ రెండు సినిమాల మొదటి భాగాలు హిట్ అయ్యాయి? కాబట్టి రెండో భాగం రిలీజ్ చేసారు. లేదంటే? రెండవ పార్ట్ వచ్చేదా? అంటే నో అనే చెప్పాలి.` దేవర 2` విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య కొరాటాల శివ `దేవర`ని పట్టాలెక్కించాడు. ఒకే భాగంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ రెండు భాగాలు చెప్పాల్సిన కథ కావడంతో? సెట్స్ కు వెళ్లిన తర్వాత రెండు భాగాలు చేసాడు. కానీ మొదటి భాగం అనుకున్నంత గొప్ప సక్సస్ అవ్వలేదు. దీంతో తాత్కాలికంగా రెండవ భాగం హోల్డ్ లో పడింది. పట్టాలెక్కి స్తామం టున్నారు. కానీ అదెప్పుడు అన్నది క్లారిటీ లేదు.
వాళ్లు మాత్రం నో అనడం లేదు:
ఎన్టీఆర్ నోట కూడా క్యాన్సిల్ అనే మాట రాలేదు. దీంతో కొరటాలకు ఇదో డ్రాబ్యాక్ లా మారింది. బాలీవుడ్ `బ్రహ్మాస్త్ర` విషయంలో కూడా ఇలాంటి సన్నివేశమే చూసాం. రణబీర్ కపూర్ హీరోగా ఆయాన్ ముఖర్జీ `బ్రహ్మస్త్ర` ను రెండు భాగాలుగా ముందే ప్రకటించాడు. కానీ మొదటి భాగానికి భారీ ఓపెనింగ్స్ తప్ప విజయం సాధించలేదు. అయినా `బ్రహాస్త 2` ఉంటుంది? అని ప్రకటించారు గానీ అదెప్పుడు అన్నది ఎవరూ క్లారిటీ గా చెప్పలేకపోతున్నారు. కేవలం హిట్ టాక్ లేకపోవడంతోనే ఈరకమైన పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కాదనలేని నిజం.
క్లైమాక్స్ లో ప్రకటన:
అయితే ఒకే కథని ఇలా రెండు భాగాలు చేయడం విషయంలో బాలీవుడ్ డైరెక్టర్ ఆధిత్య ధర్ ఎంతో వ్యూహాత్మకంగా వెళ్లాడు? అన్నది `ధురందర్` తో అద్దం పడుతుంది. రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. సైలైంట్ గా వచ్చి బాక్సాఫీస్ ని చుట్టబె ట్టేసిన చిత్రమిది. వాస్తవానికి ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా రిలీజ్ చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. రిలీజ్ అయిన సక్సెస్ అనంతరం టూబీ కంటున్యూడ్ అని ఎండ్ కార్స్డ్ లో ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మార్చి లో `ధురంధర్` 2న ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రెండు భాగాలు చేస్తే ఇలా:
అంటే మొదటి భాగంతో పాటే కంటున్యూటీ కథను చేస్తూ వచ్చారు. మార్చిలో రిలీజ్ అంటే? షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకూ పూర్తయ్యాయి కాబట్టే ప్రకటించగలిగారు. రిలీజ్ తేదీలు అనౌన్స్ చేసి వెనక్కి తీసుకోవడం..మళ్లీ కొత్త రిలీజ్ తేదీలివ్వడం..షూటింగ్ అప్ డేట్స్ ఇవ్వడం. ఇలాంటి పనులేవి పెట్టుకోకుండా సైలెంట్ గా పార్ట్ 2 కూడా బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. నవతరం మేకర్స్ సహా అనుభవం లేని వాళ్లు సినిమాను రెండు భాగాలుగా చేస్తే? గనుక ఈ రకమైన వ్యూహాన్ని అనుసరించడం ఉత్తమమైన మార్గంగా చెప్పొచ్చు.