రణ్‌వీర్ దెబ్బకు బన్నీ రికార్డ్ ఔట్!
రెగ్యులర్ యాక్షన్ స్పై థ్రిల్లర్ లకు భిన్నంగా ఈ మూవీ వెబ్ సిరీస్ తరహాలో ఎనిమిది ఛాప్టర్‌లుగా విభిజించి మూవీగా రిలీజ్ చేయడం ఓ ప్రయోగమే.;
బాలీవుడ్‌లో ఇప్పటి వరకు స్పై యూనివర్స్ నేపథ్యంలో ఎన్నో రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. కానీ వాటన్నింటికీ పూర్తి భిన్నమైన పంథాలో డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన మూవీ `ధురంధర్`. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత ఇంటెలిజెన్స్ అత్యంత రహస్యంగా జరిపిన సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో పక్కా రా కంటెంట్‌తో ఈ మూవీని దర్శకుడు ఆదిత్యధర్ రూపొందించాడు.
రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్‌ఖన్నా, సంజయ్‌దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా ఆర్జున్ కీలక పాత్రలో నటించారు. వరుస ఫ్లాపుల తరువాత రణ్‌వీర్ సింగ్ చేసిన సినిమా కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాదా సీదాగా ఈ మూవీ విడుదలైంది. రెగ్యులర్ యాక్షన్ స్పై థ్రిల్లర్ లకు భిన్నంగా ఈ మూవీ వెబ్ సిరీస్ తరహాలో ఎనిమిది ఛాప్టర్‌లుగా విభిజించి మూవీగా రిలీజ్ చేయడం ఓ ప్రయోగమే.
డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ ఐదు అరబ్ కంట్రీస్‌లలో నిషేధాన్ని ఎదుర్కొన్నా కానీ వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి రణ్‌వీర్‌సింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డు దశగా పయనిస్తోంది. బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డుల్ని సొంతం చేసుకుంటున్న `ధురంధర్` తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుందని తెలిసింది.
బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఫిల్మ్ సర్కిల్స్‌తో పాటు దాయాది దేశంలోనూ హాట్ టాపిక్‌గా మారిన `ధురంధర్` మాసీవ్ ఓటీటీ డీల్‌ని ఫినిష్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని రికార్డు రేట్‌కు దక్కించుకుందని, ఈ డీల్‌తో `ధురంధర్` బెంచ్ మార్క్‌ని సెట్ చేసిందని ట్రేడ్ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. అంతే కాదండోయ్ ఈ డీల్‌లో `పుష్ప 2` ఓటీటీ డీల్ రికార్డ్‌ని ఓవర్ టేక్ చేసిందని కూడా చెబుతున్నారు.
ఈ మూవీకి నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఫైనల్ డీల్ రూ.285 కోట్లట. `అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా వండర్ `పుష్ప 2`కు నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన డీల్ రూ.275 కోట్లు. అంటే `ధురంధర్` డీల్ పది కోట్లు ఎక్కువన్నమాట. దీంతో `పుష్ప 2` రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. అంతే కాకుండా నెట్‌ఫ్లిక్స్ ఈ రేంజ్‌లో డీల్ క్లోజ్ చేసిన హిందీ సినిమాగా కూడా `ధురంధర్` మరో రికార్డుని సొంతం చేసుకుందట. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ రేంజ్‌లో `ధురంధర్` ఓటీటీ హక్కులని సొంతం చేసుకుందంటే సినిమాకు ఏ స్థాయి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతే కాకుండా హిందీ బెల్ట్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోనే `పుష్ప 2` వసూళ్ల రికార్డుని కూడా `ధురంధర్` అధిగమించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు కథే చెప్పని పార్ట్ 1 క్రేజ్ డీల్ ఇలా ఉంటే మొత్తం కథ ఉన్న `ధురంధర్ 2` బిజినెస్ క్రేజ్ ఎలా ఉంటుందోననే చర్చ ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని `ధురంధర్ 2`ని వచ్చే ఏడాది మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సీక్వెల్ రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో మరెన్ని రికార్డుల్ని తుడిచిపెడుతుందో వేచి చూడాల్సిందే.