అల్ల‌రి న‌రేష్ స్థానాన్నిఅత‌డు సొంతం చేసుకున్న‌ట్లే!

మ‌రి ఇప్పుడా స్థానంలో ఏ న‌టుడు కొన‌సాగుతున్నాడు? అంటే ప్రియ‌ద‌ర్శి పేరు వినిపిస్తోంది.;

Update: 2025-12-18 16:30 GMT

అల్ల‌రి న‌రేష్ ఒక‌ప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలతోనైనా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లో ఉండేవారు. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా? అవ్వ‌క‌పోయినా న‌రేష్ సినిమా మాత్రం సీజ‌న్ తో ప‌నిలేకుండా రిలీజ్ అయ్యేది. కొన్ని సార్లు పండ‌గ సీజ‌న్లు కూడా క‌వ‌ర్ చేసేవారు. అలా ప‌ని చేసాడు కాబ‌ట్టే 20 ఏళ్ల కెరీర్ లో 50కి పైగా సినిమాలు చేయ‌గ లిగారు. కానీ కొంత కాలంగా ఆ ప‌రిస్థితి లేదు. `నాంది` సినిమా నుంచి న‌రేష్ ట్రాక్ మారిపోయింది. కామెడీ జాన‌ర్ని వ‌దిలేసి కొత్త ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇత‌ర స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించ‌డం లేదంటే? తానే యాక్ష‌న్ స్టార్ బ‌రిలోకి దిగ‌డం వంటివి జ‌రుగుతున్నాయి.

న‌రేష్ ని మించిన వేగంతో:

ఈ ఐదేళ్ల కాలంలో న‌రేష్ ఐదారు సినిమాలే చేసారు. దీంతో నరేష్ కెరీర్ గ్రాఫ్ ఎంత‌గా ప‌డిపోయిందో అర్దం చేసుకోవ‌చ్చు. మ‌రి ఇప్పుడా స్థానంలో ఏ న‌టుడు కొన‌సాగుతున్నాడు? అంటే ప్రియ‌ద‌ర్శి పేరు వినిపిస్తోంది. `పెళ్లి చూపులు` అనే చిత్రంతో వెలుగులోకి వ‌చ్చిన ప్రియ‌ద‌ర్శి కెరీర్ అటుపై ఎలా బిల్డ్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ చిన్న క‌మెడియ‌న్ గా ఎంట‌ర్ అయి? తాను కూడా ఊహించ‌నంత ఎత్తుకు ఎదిగాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం. `పెళ్లి చూపులు` త‌ర్వాత 2017 లో 15కి పైగా సినిమాల్లో న‌టించాడు. అవ‌న్నీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్, క‌మెడియ‌న్ పాత్ర‌లే. ఆ సినిమా హిట్ అయినా? అవ్వ‌క‌పోయినా ప్రియ‌ద‌ర్శి పాత్ర మాత్రం ప్రేక్షకుల‌కు క‌నెక్ట్ అయ్యేది.

హీరోగా బిజీగా:

అప్ప‌టి నుంచి అదే దూకుడు కొన‌సాగిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో మెయిన్ లీడ్ కి కూడా ప్ర‌మోట్ అయ్యాడు. `మ‌ల్లేశం`, `బ‌లగం`, ` త‌ప్పించుకు తిరుగు వాడు ధ‌న్యుడు సుమ‌తి`, `డార్లింగ్` ,` కోర్టు`, `28 డిగ్రీస్ సెలియ‌స్`, `సారంగ‌పాణి జాత‌కం`, ` మిత్ర‌మండ‌లి`, `ప్రేమంటే` చిత్రాల్లో హీరోగా న‌టించాడు. వీటిలో `బ‌లగం`, `కోర్టు` సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో? మెయిన్ లీడ్ కి అవ‌కాశాలు సుల‌భం అయ్యాయి. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కంటే హీరో పాత్ర‌ల పైనే దృష్టి పెట్టాడు. ప్రియ‌ద‌ర్శితో మూడు నాలుగు కోట్ల‌లో సినిమా తీయ‌గ‌ల్గితే 10 కోట్ల గ్రాస్ అయినా వ‌స్తుంది? అన్న న‌మ్మ‌కం నిర్మాత‌ల్లో ఏర్పడింది.

పారితోషికం డిమాండ్ దిశ‌గా:

బ‌ల‌మైన కంటెట్ అయితే? వ‌సూళ్లు అన్న‌ది అంచ‌నా వేయ‌డం సాద్యం కాదు. ఎందుకంటే హిట్ టాక్ వ‌చ్చిందం టే? ప్రేక్ష‌కులు ఆ సినిమాకు బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్నారు. అందులో న‌టించిన స్టార్లు? ఎవ‌రు అని తెలియకుండానే థియేట‌ర్ కి వెళ్తున్నారు. ప్ర‌స్తుతం ప్రియ‌ద‌ర్శి పారితోషికం కూడా భారీగానే అందుకుం టున్నాడ‌ని స‌మాచారం.

Tags:    

Similar News