మెగా MSG.. పక్కా రావిపూడి వైబ్
సంక్రాంతి అంటేనే మెగాస్టార్.. మెగాస్టార్ అంటేనే పూనకాలు. ఈసారి ఆ డోస్ ఇంకా గట్టిగా ఉండబోతోంది.;
సంక్రాంతి అంటేనే మెగాస్టార్.. మెగాస్టార్ అంటేనే పూనకాలు. ఈసారి ఆ డోస్ ఇంకా గట్టిగా ఉండబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' MSG సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అనిల్ మార్క్ కామెడీ, చిరు మార్క్ స్వాగ్ కలిస్తే థియేటర్లో రచ్చ రంభోలానే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ వదిలారు.
సినిమా రిలీజ్ కు ఇంకా జస్ట్ 25 రోజులే ఉంది. ఈ అకేషన్ లో టీమ్ ఒక స్పెషల్ బిహైండ్ ది సీన్స్ వీడియోను డ్రాప్ చేసింది. మామూలుగా ఇలాంటి వీడియోల్లో సీరియస్ వర్క్ కనిపిస్తుంది. కానీ ఇందులో మాత్రం సెట్స్ లో ఫుల్ చిల్ అవుతున్న విజువల్స్ ఉన్నాయి. అది షూటింగ్ స్పాట్ లా లేదు, ఏదో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లా అనిపిస్తోంది. ఆ వైబ్ చూస్తుంటేనే సినిమా ఎంత ఫన్ గా ఉండబోతోందో అర్థమైపోతుంది.
వీడియోలో మెగాస్టార్ లుక్ అయితే పీక్స్ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చిరులో ఆ వింటేజ్ జోష్ కనిపిస్తోంది. అనిల్ రావిపూడితో కలిసి బాస్ సెట్స్ లో చేసే అల్లరి మామూలుగా లేదు. ప్రతి షాట్ గ్యాప్ లోనూ జోకులు పేలుస్తూ, తెగ నవ్వుకుంటున్నారు. యంగ్ హీరోలకు కూడా సాధ్యం కాని ఎనర్జీతో చిరు సెట్ ను వైబ్రెంట్ గా మార్చేశారు. ఈసారి కామెడీ టైమింగ్ తో బాస్ బాక్సాఫీస్ ను గట్టిగా కొట్టేలా ఉన్నారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ వీడియోలో చాలా సరదాగా మూవ్ అవుతూ కనిపించింది. చిరు నయన్ మధ్య బాండింగ్ సూపర్ గా ఉంది. కేవలం మెయిన్ లీడ్స్ మాత్రమే కాదు, సెట్ లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ కూడా వర్క్ ను ప్రెజర్ లా కాకుండా ఫీల్ అయ్యారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తుంటే పకపకా నవ్వుతున్న యాక్టర్స్ ను చూస్తుంటే.. అవుట్ పుట్ వేరే లెవెల్ లో వచ్చిందని క్లియర్ గా తెలుస్తోంది.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. "ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్ సంక్రాంతి 2026" అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా పక్కా పైసా వసూల్ అనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కావాల్సిన ఎమోషన్, యూత్ కు కావాల్సిన ఫన్.. ఇలా అన్నీ కలిపి ఫుల్ మీల్స్ రెడీ చేస్తున్నట్లు మెకర్స్ చెబుతున్నారు. జనవరి 12న థియేటర్లలో పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి అంటూ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
ఇక ఈ సినిమాకు అసలైన హైలైట్ విక్టరీ వెంకటేష్ క్యామియో. చిరు సినిమాలో వెంకీ మామ ఎంట్రీ అంటే ఫ్యాన్స్ కు డబుల్ కిక్ కదా. అటు మెగా ఫ్యాన్స్, ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ చిన్న వీడియోతో సినిమా రేంజ్ ఏంటో చూపించేశారు. సంక్రాంతి విన్నర్ గా నిలవడానికి MSG అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది. మరి సినిమా ఏ లెవెల్లో హిట్ అవుతుందో చూడాలి.