నాగ్ 100.. కంటెంట్ కూడా గట్టిగానే!
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్‌లో మరో ల్యాండ్ మార్క్ కి దగ్గరయ్యాడు. 'శివ', 'అన్నమయ్య' వంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాలతో తెలుగు సినిమా గమనాన్ని మార్చిన నాగ్, ఇప్పుడు తన 100వ సినిమా కోసం ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.;
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్‌లో మరో ల్యాండ్ మార్క్ కి దగ్గరయ్యాడు. 'శివ', 'అన్నమయ్య' వంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాలతో తెలుగు సినిమా గమనాన్ని మార్చిన నాగ్, ఇప్పుడు తన 100వ సినిమా కోసం ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో కుబేర, కూలీ వంటి చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ, సోలో హీరోగా తన ల్యాండ్‌మార్క్ మూవీతో బాక్సాఫీస్ వద్ద పాత రోజులను గుర్తు చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం సైలెంట్‌గా తన పనులను జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. అయితే ఈ సినిమా కథాంశంపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేవలం యాక్షన్, ఎమోషన్స్ మాత్రమే కాకుండా కంటెంట్ పరంగా కూడా నాగ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కథ మొత్తం 'లాటరీ' బ్యాక్‌డ్రాప్‌లో సాగబోతోందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన 'లక్కీ భాస్కర్' తరహాలో జెట్ స్పీడ్ లో ధనవంతుడిగా ఎలా మారాడనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. లాటరీ చుట్టూ తిరిగే ఈ ఇంట్రెస్టింగ్ డ్రామాలో నాగ్ తనదైన శైలిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని సమాచారం. అందుకే ఈ చిత్రానికి 'లాటరీ కింగ్' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో నాగార్జున మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారనే వార్త సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా మొదలై, రాజకీయ నాయకుడిగా మారే క్రమాన్ని ఇందులో చూపిస్తారట. కథలోని మలుపులు, నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, వీరిద్దరి కెమిస్ట్రీ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారట. గ్రాఫిక్స్ మీద ఆధారపడకుండా రియల్ స్టంట్స్ చేయడానికి నాగ్ మొగ్గు చూపుతున్నట్లు కూడా టాక్ వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ల్యాండ్‌మార్క్ మూవీకి కావాల్సిన అన్ని హంగులతో సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయకుండానే సినిమాపై ఇంతటి బజ్ క్రియేట్ అవ్వడం విశేషం. కింగ్ నాగార్జున తన 100వ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఒక బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. 2026 దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ 'లాటరీ కింగ్' అక్కినేని కింగ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. టైటిల్, ఫస్ట్ లుక్ అప్‌డేట్స్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.