ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ మెగా ప్రిన్స్?

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ ఊవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన రీజ‌న‌ల్ ఫిల్మ్‌గా రికార్డు సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది;

Update: 2026-02-02 14:30 GMT

మెగా స్టార్ చిరంజీవి `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ ఊవీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన రీజ‌న‌ల్ ఫిల్మ్‌గా రికార్డు సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ మూవీ అందించిన ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు రెడీ అవుతున్నారు. రామ్ చ‌ర‌ణ్ `పెద్ది`తో పాన్ ఇండియా వైడ్‌గా త‌న స‌త్తా చాటుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

అయితే గ‌త కొంత కాలంగా రేసులో వెన‌బ‌డిన మెగా ప్రిన్స్ మాత్రం మెగా అభిమానుల్ని త‌న తాజా నిర్ణ‌యంతో క‌ల‌వ‌రానికి గురి చేస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. మెగా ఫ్రిన్స్ వ‌రుణ్ తేజ్ హిట్టు మాట విని దాదాపు నాలుగేళ్ల‌కు పైనే అవుతోంది. కెరీర్ ప్రారంభం నుంచి రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తూ సినిమాలు చేస్తూ వచ్చిన వ‌రుణ్ తేజ్ 2022 నుంచి వ‌రుస ప‌రాజ‌యాల్ని ఎదుర్కొంటున్నాడు. ప్ర‌వీణ్ స‌త్తార్‌తో క‌లిసి చేసిన `గాండీవ‌ధారి అర్జున‌` బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర వైఫ‌ల్యాన్ని ఎదుర్కొంది.

పెట్టిన పెట్టుబ‌డిని సైతం ఈ సినిమా రాబ‌ట్ట‌లేక తీవ్ర న‌ష్టాల‌ని మిగిల్చింది. దీని త‌రువాత చేసిన `ఆప‌రేష‌న్ వాలెంటైన్‌`, క‌రుణ‌కుమార్‌తో చేసిన `మ‌ట్కా` కోలుకోలేని దెబ్బ‌కొట్టాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ రెండు సినిమాలు వ‌రుణ్ తేజ్‌కు షాక్ ఇవ్వ‌డం తెలిసిందే. వ‌రుస ఫ్లాపుల త‌రువాత కొంత విరామం తీసుకున్న వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం మేర్ల‌పాక గాంధీ డైరెక్ష‌న్‌లో `కొరియ‌న్ క‌న‌క‌రాజు` పేరుతో ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. వ‌రుణ్ చేస్తున్న న్యూ జాన‌ర్ ఇది.

అయితే ఈ మూవీతో పాటు వ‌రుణ్ తేజ్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. అదే గేమ్ ఛేంజ‌ర్ రైట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ఫిల్మ్‌. అయితే దీనికి కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట‌ర్ కాదు. ఓన్లీ నిర్మాత మాత్ర‌మే.. అయినా స‌రే మెగా ఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. కార‌ణం `గేమ్ ఛేంజ‌ర్‌` ఎఫెక్ట్‌. ఈ మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజ్ స్టోరీ అందించ‌డం..ఇది బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ కావ‌డం తెలిసిందే. ఇదే ఇప్పుడు మెగా అభిమానుల్ని టెన్ష‌న్ పెడుతోంద‌ట‌.

భారీ డిజాస్ట‌ర్ ఇచ్చిన కార్తీక్ సుబ్బ‌రాజ్‌తో మ‌న‌కు సినిమా అవ‌స‌ర‌మా? అని ఫ్యాన్స్ గోల చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే మ‌రో వ‌ర్గం మాత్రం వ‌రుణ్ తేజ్ మూవీకి కార్తీక్ సుబ్బ‌రాజ్ స్టోరీ అందించ‌డం లేదు. కేవ‌లం త‌ను నిర్మాత మాత్ర‌మేన‌ని, డైరెక్ట‌ర్ మ‌రో వ్య‌క్త‌ని ఇందులో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని వాదిస్తున్నారు. ఎంత వాదిస్తున్నా మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ విష‌యంలో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ట‌. మ‌రి దీనిపై వ‌రుణ్ తేజ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Tags:    

Similar News