బిగ్ బాస్ 9.. టాప్ 3 కి దూసుకొస్తున్న డీమాన్ చివరి వారం ట్విస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. అసలు టాప్ 5 దాకా ఉంటాడా లేదా అన్న పరిస్థితి మొన్నటిదాకా ఉంది.;

Update: 2025-12-18 13:33 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో డీమాన్ పవన్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. అసలు టాప్ 5 దాకా ఉంటాడా లేదా అన్న పరిస్థితి మొన్నటిదాకా ఉంది. కానీ ఎప్పుడైతే రీతు రెండు వారాల క్రితం ఎలిమినేట్ అయ్యిందో అతను ఆటలో మరింత పట్టు సాధించాడు. టాస్క్ లు మాత్రమే కాదు హౌస్ మేట్స్ తో బాగా కలిసిపోతున్నాడు. టాప్ 5 హౌస్ లో సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ వారం ఈ సీజన్ మొత్తం జరిగిన టాస్క్ లను రివైండ్ చేస్తూ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లల్లో డీమాన్ పవన్ అదరగొట్టాడు. అలా తన ఆట తీరుతో సరైన ఛాన్స్ వస్తే తాను ఎలా ఆడగలనో ప్రూవ్ చేశాడు డీమాన్ పవన్.

ఈ వారం జరుగుతున్న టాస్క్ లల్లో..

ఐతే మొన్నటిదాకా టాప్ 5లో చివరి పొజిషన్ లేదా టాప్ 4లో కొనసాగుతూ వచ్చాడు డీమాన్ పవన్. కానీ ఈ రెండు వారాలు అతను ఆడుతున్న తీరు ముఖ్యంగా ఈ వారం జరుగుతున్న టాస్క్ లల్లో అతని దూకుడు చూస్తే ఆడియన్స్ డీమాన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాని వల్ల కళ్యాణ్, తనూజ టాప్ 2లో వెళ్తుండగా టాప్ 3 కి డీమాన్ దూసుకొస్తున్నాడు. ఇమ్మాన్యుయెల్ కి ధీటుగా డీమాన్ పవన్ కి ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది.

డీమాన్ పవన్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి ఈ సీజన్ లో ఛాన్స్ అందుకున్నాడు. ఐతే మొదటి నుంచి అతని ఆట తీరు బాగున్నా లక్ కలిసి రాలేదు. దానికి తోడు రీతు ఎప్పుడు అతని ఆటకి అడ్డుగా ఉంటూ వచ్చింది. సీజన్ మొత్తం రీతుకి సపోర్ట్ గా ఆడటమే డీమాన్ చేస్తూ వచ్చాడు. అందుకే అతను కాస్త వెనక పడ్డాడు. ఐతే రీతు ఎలిమినేట్ అయ్యాక డీమాన్ చాలా ఫ్రీ అయ్యాడు. ఆట, మాట అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు.

ఇదే దూకుడు మొదటి నుంచి చూపిస్తే..

ఐతే డీమాన్ ఇదే దూకుడు మొదటి నుంచి చూపిస్తే తప్పకుండా టాప్ 2లో ఉండే వాడని అందరు అనుకుంటున్నారు. ఐతే రీతు వల్ల ఆట కాస్త ట్రాక్ తప్పినా ఆ మైలేజ్ తోనే అతను ఇక్కడిదాకా వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా డీమాన్ పవన్ టాప్ 5 నుంచి నిజంగానే టాప్ 3కి వస్తాడా లేదా విన్నర్ గా మారే అవకాశం కూడాఅ ఉందా అన్నది చూడాలి. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ లో విజేతగా ఈ ఐదుగురిలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా ఉంది.

డీమాన్ పవన్ తో పాటు మరో కామనర్ కళ్యాణ్ గత ఐదు వారాల నుంచి టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. కళ్యాణ్ కి ఈక్వల్ గా డీమాన్ కి ఓటింగ్ పడితే ఇద్దరిలోనే విన్నర్ రన్నర్ ఉండే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News