27 ఏళ్ల త‌ర్వాత హిట్ కాంబినేష‌న్!

బాలీవుడ్ న‌టులు ధర్మేంద్ర‌-అర్బాజ్ ఖాన్ 'ప్యార్ కియాతో డ‌ర్నా క్యా'లో న‌టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది.;

Update: 2025-06-14 05:35 GMT

బాలీవుడ్ న‌టులు ధర్మేంద్ర‌-అర్బాజ్ ఖాన్ 'ప్యార్ కియాతో డ‌ర్నా క్యా'లో న‌టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. స‌ల్మాన్ ఖాన్, కాజోల్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. ధ‌ర్మేం ద్ర‌- ఆర్బాజ్ కీల‌క పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానే అలరించారు. 1998లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ క్రేజీ కాంబినేష‌న్ మ‌రో సినిమాలో క‌లిసి న‌టించ‌లేదు. ఎవ‌రికి వారు స్వ‌తంత్రంగా సినిమాలు చేసుకున్నారు త‌ప్ప క‌లిసి న‌టించ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు.

అలా ఇద్ద‌రు క‌లిసి న‌టించి 27 ఏళ్లు గ‌డిచిపోయింది. అయితే ఇద్ద‌రు మ‌ళ్లీ 'మైనే ప్యార్ కియా పిర్ సే' చిత్రంలో న‌టిస్తున్నారు. ఇది థ్రిల్ల‌ర్ అంశాల‌తో కూడిన చిత్రం. ఈ చిత్రానికి స‌బీర్ షేక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను ఇటీవ‌లే అధికారికంగా ముంబైలో ప్ర‌క‌టించారు. ఈసంద‌ర్భంగా ధ‌ర్మేంద్ర సంతోషం వ్య‌క్తం చేసారు. ఆర్బాజ్ ఖాన్ తో మ‌ళ్లీ క‌లిసి న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది.

ఎప్ప‌టి నుంచో క‌లిసి చేయాలనుకుంటున్నా? ఆయ‌న కూడా నాలాగే అనుకుంటున్నారు. అది ఇప్పటికీ కుదిరింది. ఆ నాటి రోజుల్ని మ‌ళ్లీ మ‌రిపిస్తామ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అయితే ఈ సినిమా 'ప్యార్ కియాతో డ‌ర్నా క్యా'కి సీక్వెల్ అన్న‌ది రివీల్ చేయ‌లేదు. టైటిల్ ను బ‌ట్టి సీక్వెల్ లా ఉంది. అలాగే హీరో-హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది కూడా ప్ర‌క‌టించ‌లేదు.

స‌ల్మాన్ ఖాన్-కాజోల్ ఇప్పుడు హీరో హీరోయిన్ గా న‌టించ‌రు కాబ‌ట్టి వాళ్ల పాత్ర‌ల‌కు నేటి త‌రం న‌టీన‌టుల్ని తీసుకోనున్నారు. ఇంకా సినిమాలో కొన్ని కీల‌క పాత్ర‌ల‌కు అప్ప‌టి సీనియ‌ర్ న‌టుల్ని తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ లో 20-30 ఏళ్ల క్రితం నాటి సినిమాలు కూడా రీమేక్ అవ్వ‌డం...లేదా వాటికి సీక్వెల్ చేయ‌డం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే చాలా సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.

Tags:    

Similar News