దేవా కట్ట మయసభ ఎప్పుడంటే..?
ఇక టీజర్ విషయానికి వస్తే ఆయన చెప్పినట్టుగానే 1975 లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనను రిఫరెన్స్ గా తీసుకుని ఈ కథను అందులోని పాత్రలను తీర్చిదిద్దారు.;
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన దేవా కట్ట తన రెండు దశాబ్దాల కెరీర్ లో తీసింది ఐదు సినిమాలే కానీ ఆయనంటే తెలుగు ఆడియన్స్ కి ఒక ప్రత్యేకమైన అభిమానం. వెన్నెల, ప్రస్థానం, రిపబ్లిక్ ఇలా తన మార్క్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు దేవా కట్ట. ప్రస్తుతం ఆయన మయసభ అంటూ ఒక వెబ్ సీరీస్ తో రాబోతున్నారు. యుద్ధం నీ ధర్మం అంటూ ఈ మయసభ వెబ్ సీరీస్ ని ప్రమోట్ చేస్తున్నారు.
ఈ వెబ్ సీరీస్ ని సోనీ లివ్ లో రిలీజ్ చేస్తున్నారు. సినిమాల్లోనే తన ప్రత్యేకత చూపించిన దేవా కట్ట ఈ వెబ్ సీరీస్ తో కూడా తన మార్క్ మేకింగ్ అండ్ విజువల్ వండర్ ని ఆడియన్స్ కి చూపిస్తారట. ఈ వెబ్ సీరీస్ అంతా కూడా 1975 లో సాగిన కథ గా కొన్ని సంఘటన ప్రేరణతో ఈ సీరీస్ తెరకెక్కిస్తున్నారట.
మయసభ వెబ్ సీరీస్ లో స్నేహం, ఆశయం, పోటీ ఇలా అన్ని కథలు ఉంటాయి. ఈ ప్రయాణాన్ని మీరు ఆనందిస్తారంటూ డైరెక్టర్ దేవా కట్ట తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అంతేకాదు ఈ వెబ్ సీరీస్ ఆగష్టు 7న సోనీ లివ్ లో రాబోతుంది. దేవా కట్ట మయసభ మరోసారి ఆయన ప్రస్థానం సినిమా రోజులను గుర్తు చేసేలా ఉంది.
ఇక టీజర్ విషయానికి వస్తే ఆయన చెప్పినట్టుగానే 1975 లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనను రిఫరెన్స్ గా తీసుకుని ఈ కథను అందులోని పాత్రలను తీర్చిదిద్దారు. తప్పకుండా మయసభ సీజన్ 1 సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంది. మయసభ సీజన్ 1 రైజ్ ఆఫ్ ది టైటాన్స్ అంటూ రాబోతుంది. ఇది ఎలా ఉండబోతుంది అన్నది టీజర్ లోనే చూపించారు.
దేవా కట్ట ప్రత్యేకంగా చాలా ఆసక్తితో ఈ వెబ్ సీరీస్ దర్శకత్వం వహించారు. ఈ సీరీస్ కు అన్నీ తానై చివరకు నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. మరి ఈ సీరీస్ తో దేవా కట్టా సూపర్ కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. దీనితో పాటు సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కూడా దేవా కట్ట డైలాగ్స్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.